టాలీవుడ్‌లో అసలు సిసలు బాక్సాఫీస్ ఫైట్ మొదలైంది. ఒకవైపు నటసింహం బాలకృష్ణ ‘అఖండ 2’తో డిసెంబర్ 5న గర్జించేందుకు రెడీ అవుతుంటే, మరోవైపు మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకరవరప్రసాద్ గారు’ అంటూ సంక్రాంతి బరిలో దిగుతున్నారు. అయితే, రిలీజ్‌కు ముందే ఈ రెండు సినిమాల మధ్య థియేట్రికల్ బిజినెస్ వార్ ఓ రేంజ్‌లో నడుస్తోంది. ట్రేడ్ వర్గాల్లో జరుగుతున్న ఈ బిజినెస్ ఫైట్‌లో ఎవరిది పైచేయి? చూద్దాం.ఈ రెండు సినిమాల గేమ్ ప్లాన్ వేర్వేరుగా ఉంది. డిసెంబర్‌లో పెద్ద సినిమాలేవీ లేకపోవడంతో, ‘అఖండ 2’ సోలో రిలీజ్ అడ్వాంటేజ్‌ను టార్గెట్ చేస్తోంది.
మరోవైపు, చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబోలోని ‘మన శంకరవరప్రసాద్ గారు’ సంక్రాంతి పండుగ సెలవులను క్యాష్ చేసుకునేందుకు పక్కా ప్లాన్‌తో వస్తోంది. ఈ క్రేజీ కాంబోలపై ఉన్న నమ్మకంతో డిస్ట్రిబ్యూటర్లు భారీ మొత్తాలు పెట్టేందుకు పోటీ పడుతున్నారు.ప్రస్తుతం ట్రేడ్ అంచనాల ప్రకారం, బిజినెస్‌లో మెగాస్టార్ చిరంజీవి సినిమానే లీడ్‌లో ఉంది. ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాకు ఒక్క ఆంధ్ర ఏరియాలోనే రూ.63 కోట్ల బిజినెస్ రేషియో పలుకుతోంది. నైజాంలో కూడా రూ.45 కోట్ల వరకు కోట్ చేస్తున్నారు.
సంక్రాంతికి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అనే ఫార్ములా ఈ రేంజ్ డిమాండ్‌కు ప్రధాన కారణం. ‘అఖండ’ బ్రాండ్‌తో వస్తున్న అఖండ 2 సినిమాకు కూడా క్రేజ్ తక్కువేమీ లేదు. ఆంధ్రలో రూ.54 కోట్లు, నైజాంలో రూ.36 కోట్ల వరకు బిజినెస్ అంచనాలు ఉన్నాయి.ఆంధ్ర, నైజాం.. రెండు ఏరియాల్లోనూ బాలయ్య సినిమా కంటే చిరంజీవి సినిమాకే ఎక్కువ బిజినెస్ జరుగుతోంది. దీనికి కారణం, సంక్రాంతి సీజన్‌కు అనిల్ రావిపూడి మార్క్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుందని డిస్ట్రిబ్యూటర్లు బలంగా నమ్ముతున్నారు. అయితే, ‘అఖండ 2’కు ఉన్న సోలో రిలీజ్ అడ్వాంటేజ్ కూడా తక్కువేమీ కాదు. అయితే రిలీజ్ తర్వాత ఈ సినిమాల్లో బాక్సాఫీస్ వద్ద ఏది ఎక్కువ కలెక్ట్ చేస్తుందో చూడాలి.