Chiranjeevi: చిరు పై విష ప్రయోగం చేశారా… ఆ చేదు జ్ఞాపకాన్ని గుర్తు చేసుకున్న మెగాస్టార్!

సాధారణంగా ఇండస్ట్రీలో ఒకరు ఎదుగుతుంటే తనని పాతాళానికి తొక్కేయాలని చాలామంది చూస్తుంటారు. ఇలా కొందరి హీరోల పెత్తనం వల్ల ఎంతో మంది టాలెంట్ ఉన్న హీరోలు ఇండస్ట్రీకి కనుమరుగైపోయారు. అయితే ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చి ఇండస్ట్రీలో అగ్ర హీరోగా ఎదుగుతున్న చిరంజీవిపై కూడా చాలామంది ఈర్ష్యతో తనని అణిచివేయాలని చూసారు.అయితే ఒకానొక సమయంలో చిరంజీవి పై విష ప్రయోగం కూడా జరిగిందనే విషయం అందరికీ తెలిసిందే.

తాజాగా ఈ విషయాన్ని చిరంజీవి వాల్తేరు వీరయ్య సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా బయట పెడుతూ అప్పటి విషయాలను గుర్తు చేసుకున్నారు.ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ మరణం మృదంగం సినిమా షూటింగ్ సమయంలో అభిమాని తనపై విష ప్రయోగం చేశారని ఈ సందర్భంగా తెలియజేశారు.ఈ సినిమా షూటింగ్ సమయంలో ఒక అభిమాని అక్కడికి వచ్చి తన బర్త్ డే అని చెప్పి తన చేత కేక్ కట్ చేయించారని చిరు తెలిపారు.

ఇలా కేక్ కట్ చేసిన అనంతరం బలవంతంగా ఆ అభిమాని నాకు కేక్ చేతితో తినిపించారు.నాకు స్పూన్ తో కేక్ తినడం అలవాటు అయితే అభిమాని అలా తినిపించడంతో కేక్ చేదుగా అనిపించి ఒక్కసారిగా తినకుండా మొత్తం బయటకు పడేసాను. అయితే ఈ విషయం చిత్ర బృందంతో చెబితే వెంటనే ఆ అభిమానిని పట్టుకొని చితకొట్టారు. అలాగే కేక్ శాంపిల్ టెస్టింగ్ కి పంపించడంతో అందులో విషం కలిపి ఉందని రిపోర్ట్స్ వచ్చాయి.

ఇక ఆ అభిమానిని పట్టుకొని అతని నుంచి నిజం రాబట్టడంతో నేను తనతో మాట్లాడలేదని కేరళ నుంచి ఏదో వశీకరణ పౌడర్ తెచ్చి కేక్ లో కలిపినట్టు నిజం ఒప్పుకున్నారు. అయితే వెంటనే అలర్ట్ అవడం వల్ల పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నానని ఈ సందర్భంగా చిరు గతంలో తనకు జరిగిన విష ప్రయోగం గురించి ఈ సందర్భంగా బయటపెట్టారు. అయితే చిరంజీవి మాత్రం తనపై విష ప్రయోగం చేసిన అభిమానిని వదిలేయడం గమనార్హం.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus