చిరంజీవి, పవన్, చరణ్ కాంబో మూవీ అలా ఉండబోతుందా?

మెగా ఫ్యామిలీ నుంచి ఏదైనా మల్టీస్టారర్ తెరకెక్కుతుందంటే ఆ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు ఏర్పడతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చిరంజీవి, చరణ్ కాంబోలో ఇప్పటికే పలు సినిమాలు తెరకెక్కగా ఆ సినిమాలు మిక్స్డ్ రిజల్ట్స్ ను సొంతం చేసుకున్నాయి. తాజాగా దర్శకుడు హరీష్ శంకర్ చిరంజీవి, పవన్, చరణ్ కాంబినేషన్ లో మూవీ గురించి కామెంట్స్ చేయగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ ఫ్యాన్స్ అంచనాలను మించి ఉంటుందని హరీష్ శంకర్ వెల్లడించారు.

డైరెక్టర్ శంకర్ అంటే ఎంతో ఇష్టమని ఆయన చెప్పుకొచ్చారు. సందీప్ రెడ్డి వంగా, సుకుమార్ లను కూడా ఎంతగానో ఇష్టపడతానని ఆయన తెలిపారు. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ఒక మాటలో చెప్పడం సాధ్యం కాదని హరీష్ శంకర్ అభిప్రాయం వ్యక్తం చేశారు. హరీష్ శంకర్ అభిమానులతో ముచ్చటించగా ఆ సమయంలో ఈ కామెంట్లు చేశారు.

చిరంజీవి చరణ్ కాంబినేషన్ లో సినిమా తీస్తారా అనే ప్రశ్నకు హరీష్ శంకర్ స్పందిస్తూ చిరంజీవి, పవన్, చరణ్ కాంబోలో సినిమా తీస్తానని తెలిపారు. ఈ కాంబోలో నిజంగా సినిమా తెరకెక్కితే మాత్రం ఆ సినిమా నెక్స్ట్ లెవెల్ మూవీ అవుతుందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఈ కాంబోలో సినిమా రావాలని మెగా ఫ్యాన్స్ ఆకాంక్షిస్తున్నారు. హరీష్ శంకర్ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాను ఎప్పుడు థియేటర్లలో రిలీజయ్యేలా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

ఈ సినిమా ఒకింత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోందని తెలుస్తోంది. ఉస్తాద్ భగత్ సింగ్ సినిమాలో శ్రీలీల హీరోయిన్ గా నటిస్తుండగా ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో లేదో చూడాల్సి ఉంది. మెగా హీరోలు ప్రస్తుతం పలు క్రేజీ ప్రాజెక్ట్ లతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మెగా హీరోలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus