Chiranjeevi, Pawan Kalyan: ఇటు చిరంజీవి.. అటు పవన్ కళ్యాణ్!

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ ఫిల్మ్ సిటీలో హడావిడి చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఇద్దరు అన్నదమ్ముల సినిమాలు రామోజీ ఫిలింసిటీలో ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంటున్నాయి. చిరంజీవి హీరోగా నటిస్తోన్న ‘వాల్తేర్ వీరయ్య’ షూటింగ్ ఫిలింసిటీలో శరవేగంగా జరుగుతోంది. చిరంజీవి-రవితేజల మధ్య కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈరోజు, రేపటితో షూటింగ్ పూర్తవుతుంది. అక్కడితో సినిమా టాకీ పార్ట్ పూర్తవుతుంది. ఒక్క పాట మాత్రమే బ్యాలెన్స్ ఉంది. దానికోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారు.

ఫ్రాన్స్ లో చిరంజీవి, శృతిహాసన్ ల మధ్య ఒక డ్యూయెట్ ను ప్లాన్ చేస్తున్నారు. సాంగ్ పూర్తయితే ‘వాల్తేర్ వీరయ్య’ షూటింగ్ మొత్తం పూర్తవుతుంది. సంక్రాంతికి సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాతో పాటు పవన్ కళ్యాణ్ నటిస్తోన్న ‘హరిహర వీరమల్లు’ షూటింగ్ కూడా రామోజీ ఫిలింసిటీలోనే జరుగుతోంది. వంద మంది జూనియర్ ఆర్టిస్ట్ లు, ఫైటర్స్ తో కలిసి ఓ యాక్షన్ ఎపిసోడ్ లో నటిస్తున్నారు పవన్ కళ్యాణ్.

సినిమాలో ఇంటర్వెల్ కు ముందు వచ్చే ఫైట్ ఇది. ఈ సీక్వెన్స్ కి సంబంధించిన షూటింగ్ మరో వారం, పది రోజుల వరకు ఉండొచ్చు. ఇదే షూటింగ్ లో పవన్ కళ్యాణ్ వీరమల్లు గెటప్ లో ఖరీదైన బైక్ పై లొకేషన్ లో చక్కర్లు కొడుతున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇలా మెగా అన్నదమ్ములు ఇద్దరూ కూడా ఒకే చోట తమ సినిమాలతో బిజీగా గడుపుతున్నారు. ‘హరిహర వీరమల్లు’ సినిమాను వచ్చే ఏడాది మార్చిలో రిలీజ్ చేయాలనుకున్నారు. కానీ ఇప్పుడు డేట్ మారే ఛాన్స్ ఉంది.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus