మెగాస్టార్ చిరంజీవి నిర్మాతల కష్టాన్ని అర్ధం చేసుకుని… వారి ఖర్చుల భారం తగ్గించే ఉపాయాన్ని గతేడాది తెలిపిన సంగతి తెలిసిందే. వివరాల్లోకి వెళితే.. కార్ వ్యాన్ సంస్కృతి మారాలంటూ చిరు కామెంట్స్ గతేడాది విరుచుకుపడ్డారు. షాట్ అయిపోయిన వెంటనే ఆర్టిస్ట్ లు వెళ్లి కార్ వ్యాన్ లలో దూరేస్తున్నారు.దానిని కేవలం అవసరాలకు తగినట్లుగా వాడుకోవాలి తప్ప.. ప్రెస్టీజియస్ గా తీసుకుని అందులోకి వెళ్లిపోకూడదు అంటూ ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఓ సినిమా తీయడానికి 9 నెలల నుండీ ఏడాది టైం పడుతుంది అనుకుంటే.. నిర్మాతకి నెలకి రూ.60 లక్షల వరకు కార్ వ్యాన్ ల దగ్గరే పెట్టాల్సి వస్తుంది. అలా షూటింగ్ పూర్తయ్యే సరికి రూ.6 కోట్ల పైనే వారి పై భారం పడుతుంది అని ఆయన తెలిపారు. ‘కార్ వ్యానా కాపురాల వ్యానా’ అంటూ పంచ్ డైలాగులు కూడా వదిలారు. చిరు అభిప్రాయాన్ని ఏకీభవిస్తూ.. ఇండస్ట్రీలో పెద్దలందరూ మద్దతు పలికారు. కానీ కరోనా వైరస్ వల్ల చిరు ప్లాన్ ఫెయిల్ అయ్యింది అనేది ఇన్సైడ్ నడుస్తున్న చర్చ.
గతేడాది ఆగష్ట్ లో షూటింగ్ లు మొదలుపెట్టినప్పుడు కూడా స్టార్ హీరోలతో పాటు సీనియర్ ఆర్టిస్ట్ లు కూడా కార్ వ్యాన్ ల సదుపాయాలు కావాలని డిమాండ్ చేశారట. అయితే కొంతమంది నిర్మాతల కష్టాలను అర్ధం చేసుకుని సర్దుకు పోయినట్టు వినికిడి. కానీ సెకండ్ వేవ్ దెబ్బకు హీరో, హీరోయిన్లు, సీనియర్ ఆర్టిస్ట్ లతో పాటు మరికొంత మందికి కార్ వ్యాన్ లు కావాలని.. అవి ఉంటేనే షూటింగ్ లకు వస్తామని తెగేసి చెబుతున్నారట. సోషల్ డిస్టెన్స్ మరియు సెపరేట్ వాష్ రూమ్ లు ఉంటే సేఫ్టీ ఉంటుందని వారు భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Most Recommended Video
ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!