ఆ చిన్నారి టాలెంట్ కు ఫిదా అయిన మెగాస్టార్.. ఏమైందంటే?

  • May 15, 2023 / 08:26 AM IST

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన మెగాస్టార్ చిరంజీవి టాలెంట్ ఉన్నవాళ్లను ప్రశంసించే విషయంలో ముందువరసలో ఉంటారనే సంగతి తెలిసిందే. తెలుగు ఇండియన్ ఐడల్ కంటెస్టెంట్ ప్రణతి టాలెంట్ ను మెచ్చిన చిరంజీవి ఇంటికి పిలిచి ఆ చిన్నారిని అభినందించారు. ప్రముఖ ఓటీటీ సంస్థలలో ఒకటైన ఆహా ఓటీటీలో తెలుగు ఇండియన్ ఐడల్ సీజన్2 ప్రసారమవుతోంది. ఫస్ట్ సీజన్ సక్సెస్ అయిన విధంగా సెకండ్ సీజన్ సైతం ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

ఈ సీజన్ లో మధురమైన గొంతుతో ప్రణతి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. చిరంజీవి తన నివాసంలో ప్రణతిని ఆశీర్వదించగా అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. చిరంజీవిని కలిసిన ప్రణతి అన్నమాచార్య కీర్తన పాడి మెప్పించారని సమాచారం. భవిష్యత్తులో ప్రణతి కెరీర్ పరంగా మరింత సక్సెస్ సాధించాలని చిరంజీవి ఆకాంక్షించడం గమనార్హం. వైజాగ్ కు చెందిన ప్రణతి టాలెంట్ కు నెటిజన్లు సైతం ఫిదా అవుతున్నారు.

తెలుగు ఇండియన్ ఐడల్ షో ద్వారా ఎంతోమంది ప్రతిభ ఉన్న గాయనీమణులు వెలుగులోకి వస్తున్నారని తెలుస్తోంది. చిరంజీవి ఆశీర్వాదం దక్కిందంటే భవిష్యత్తులో ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్లు ప్రణతికి సింగర్ గా ఛాన్స్ ఇచ్చే అవకాశం అయితే ఉందని కొంతమంది కామెంట్లు చేస్తుండటం గమనార్హం. చిరంజీవి విషయానికి వస్తే ప్రస్తుతం భోళా శంకర్ సినిమాతో మెగాస్టార్ బిజీగా ఉన్నారు. త్వరలో చిరంజీవి కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది.

చిరంజీవి రెమ్యునరేషన్ భారీ రేంజ్ లో ఉందని సమాచారం అందుతోంది. చిరంజీవి మల్టీస్టారర్ సినిమాలకు ప్రాధాన్యత ఇస్తుండగా సినిమా సినిమాకు చిరంజీవికి క్రేజ్ పెరుగుతుండటం గమనార్హం. చిరంజీవి వాల్తేరు వీరయ్యతో రీఎంట్రీలో భారీ హిట్ అందుకున్నారు. ఈ సినిమా నిర్మాతలకు కళ్లు చెదిరే స్థాయిలో లాభాలను అందించడం గమనార్హం. సినిమా సినిమాకు చిరంజీవి రేంజ్ పెరుగుతోంది.

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus