సినిమా అంటేనే బిజినెస్ అయిపోయిన ఈ కాలంలో ఎవరు పడితే వాళ్ళు నిర్మాతలుగా మారిపోయి మరీ సినిమాలు తీసేస్తున్నారు. చిన్నా..పెద్ద నిర్మాతలు అన్న ఆలోచన ఏమాత్రం లేకుండా హీరోని బట్టి సినిమాను భారీ లెవెల్ లో తీసేస్తున్నారు. అయితే అదే క్రమంలో టాలీవుడ్ మెగాస్టార్ చిరు దాదాపుగా 10ఏళ్ల తరువాత వస్తున్న 150వ సినిమా కోసం ఎందరో నిర్మాతలు ఎగబడగా చిరు మాత్రం ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా తానే తన కుమారుణ్ణి నిర్మాతగా మార్చి, ఒక బ్యానర్ సైతం సెట్ చేసి సెట్స్ పైకి వస్తున్నాడు.
ఇక ఈ సినిమా షూటింగ్ మొదలయ్యి దాదాపుగా 2షెడ్యూల్స్ పూర్తయ్యినప్పటికీ ఈ సినిమా ఇంకా సందిగ్ధంలోనే ఉంది అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఏదో ఒక విషయంతో ఈ సినిమా వార్తల్లో నిలుస్తుంది….మొన్నటి వరకూ హీరోయిన్, విలన్ గొడవ, ఈరోజు కొత్తగా రెమ్యునిరేషన్ గొడవ. ఇంతకీ విషయం ఏమిటంటే…చిరు 150వ సినిమాకి రెమ్యునరేషన్ దాదాపు 30 కోట్ల రూపాయలు తీసుకుంటున్నట్లు లెక్క తేలింది.
అయితే అదే క్రమంలో మిగతా టెక్నిషన్స్ కి సైతం భారీగానే ఇస్తున్నట్లు తెలుస్తుంది. కానీ అందరిలో వినాయక్ కు మాత్రం కాస్త తగ్గించినట్లే సమాచారం. ఇక టాలీవుడ్ లెక్కల ప్రకారం ఈ సినిమాకు వినాయక్ తీసుకునే అమౌంట్ 5కోట్ల కన్నా తక్కువే అని తెలుస్తుంది. మరి అందరికీ న్యాయం చేసిన చిరు వినాయక్ విషయంలో ఎందుకంత చిన్న చూపు అంటే..మూవీ బడ్జెట్ ని తగ్గించే కోణంలో జరిగిఉండొచ్చని మెగా బ్యాచ్ వాదన. ఏది ఏమైనా…దీనిపై చిరు మళ్లీ ఆలోచిస్తే బావుంటుంది.