Chiranjeevi: పునాది రాళ్లు సినిమాకి చిరు కంటే 4 రేట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకున్న హీరో ఇతనేనా..!

కొన్ని కొన్ని సినిమాలు.. న‌టుల జీవితాల‌ను మ‌లుపు తిప్పుతాయ‌నేది అంద‌రికీ తెలిసిందే. ఇలానే.. మెగాస్టార్ చిరంజీవి జీవితంలో మ‌లుపుతిప్పిన సినిమా పునాది రాళ్లు. ఈ సినిమా అప్ప‌ట్లో ఎవ‌ర‌గ్రీన్ హిట్ కొట్టింది. చిరును సూప‌ర్ హీరోను చేసింది. అయితే.. ఈ సినిమా స‌మ‌యానికి చిరు గురించి ప్ర‌త్యేకంగా చ‌ర్చ‌లేదు. కేవ‌లం ప్ర‌త్యేక డ్యాన్స్‌లు మాత్ర‌మే చేసేవార‌ట‌. అప్ప‌టికి ఎన్టీఆర్‌, అక్కినేని వంటివారు దూకుడుగా ఉన్నారు. అయితే.. యువ‌త‌రం పెరుగుతున్న నేప‌థ్యంలో వారిని ఆక‌ట్టుకునేలా డ్యాన్స్‌చేసేవారి కోసం ద‌ర్శ‌కులు ఎదురు చూస్తున్నారు.

ఎన్టీఆర్ త‌ర్వాత‌.. డ్యాన్స్‌బాగా చేయ‌గ‌ల హీరోల్లో అక్కినేని, చంద్ర‌మోహ‌న్‌, శోభ‌న్‌బాబు పేర్లు బాగా వినిపించేవి. ఇలాంటి స‌మ యంలో యువ‌త‌ను ఉర్రూత లూగించే లెవిల్లో డ్యాన్స్ చేయ‌గ‌ల నైపుణ్యం సంపాయించుకున్నారు చిరంజీవి. ఇది ఆయ‌న‌ను ఇండ‌స్ట్రీలో నిల‌బెట్టింది. అయినా.. కూడా రెమ్యున‌రేష‌న్ మాత్రం పెర‌గలేదు. చిరు కూడా మొహ‌మాటంతో ఎవ‌రినీ రెమ్యున‌రేష‌న్ పెంచ‌మ‌ని కోరేవారు కాద‌ట‌. ఇలా.. పునాది రాళ్లు సినిమాలో చిరంజీవికి ఇచ్చిన వేత‌నం రూ.5000. కానీ, ఇందులోనే న‌టించిన చంద్ర‌మోహ‌న్‌కు మాత్రం రూ.25000 ఇచ్చారు.

సీనియ‌ర్ న‌టుడు కావ‌డంతో చంద్ర‌మోహ‌న్‌కు ఇంత ఇచ్చార‌నేది అప్ప‌ట్లో టాక్‌. అయితే..త‌ర్వాత త‌ర్వాత‌.. చంద్ర‌మోహ‌న్ కంటే కూడా చిరు దూసుకుపోయారు. మ‌న‌వూరి పాండ‌వులు సినిమాకు చిరుకు 25 వేలు, చంద్ర‌మోహ‌న్‌కు 30 వేలు ఇచ్చారు. ఇలా రెమ్యున‌రేష‌న్ పెంచుకుంటూ పోయిన చిరు..

ఇక‌, కొన్నాళ్ల‌కు ఎన్టీఆర్‌తోనే పోటీ పడే ప‌రిస్థితి వ‌చ్చింద‌ట‌. ఆయ‌న బావ‌మరిది అర‌వింద్ స‌ల‌హాలు.. సూచ‌న‌లు ఎక్కువ‌గా పాటించ‌డంతో చిరు హ‌ద్దులు లేని విధంగా దూసుకుపోయాడ‌నే టాక్ ఉంది. ఏ పాత్ర‌లు ఒప్పుకోవాలి? ఎంత రెమ్యున‌రేష‌న్ తీసుకోవాలో.. కూడా అర‌వింద్ నిర్ణ‌యించేవాడ‌ట‌. ఇలా.. చిరంజీవి (Chiranjeevi) జీవితంలో పునాదిరాళ్లు చిత్రం మేలి మ‌లుప‌నేది ఇండ‌స్ట్రీ టాక్‌.

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus