Chiranjeevi: చిరంజీవికి ఈతరం కమెడియన్లలో ఫేవరెట్ కమెడియన్ ఎవరో తెలుసా?

మెగాస్టార్ చిరంజీవికి (Chiranjeevi)  ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో క్రేజ్ ఉందనే సంగతి తెలిసిందే. ఈ సీనియర్ హీరో టాలెంట్ ఉన్నవాళ్లను ప్రోత్సహించే విషయంలో ముందువరసలో ఉంటారని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. జబర్దస్త్ కమెడియన్లలో ఒకరైన గెటప్ శ్రీను (Getup Srinu) ఈ మధ్య కాలంలో చిరంజీవి సినిమాలలో వరుసగా ఆఫర్లను సొంతం చేసుకుంటున్న సంగతి తెలిసిందే. రాజు యాదవ్ సినిమాతో గెటప్ శ్రీను హీరోగా లక్ పరీక్షించుకుంటున్నారు. అయితే ఈతరం కమెడియన్లలో నచ్చిన వ్యక్తి గెటప్ శ్రీను అంటూ చిరంజీవి ఒక వీడియో బైట్ రిలీజ్ చేయడం ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్ అవుతోంది.

రాజు యాదవ్ (Raju Yadav) సినిమా ప్రమోషన్స్ కు హెల్ప్ కావాలనే ఆలోచనతో మెగాస్టార్ ఈ వీడియో బైట్ ను రిలీజ్ చేయడం జరిగింది. గెటప్ శ్రీను పేరును తలచుకుంటే జబర్దస్త్ షోలో అతని గెటప్స్, యాస, ఎక్స్ ప్రెషన్స్ గుర్తుకు వస్తాయని చిరంజీవి అన్నారు. ఈతరం యంగ్ కమెడియన్స్ లో గెటప్ శ్రీను అంటే నాకు చాలా అభిమానమని ఆయన కామెంట్లు చేశారు. రాజు యాదవ్ ట్రైలర్ నచ్చిందని సినిమాలో కొత్తదనం ఉంటుందని అనిపించిందని చిరంజీవి పేర్కొన్నారు.

ఈ సినిమాతో గెటప్ శ్రీను సక్సెస్ అందుకుంటారని నమ్ముతున్నానని చిరంజీవి తెలిపారు. గెటప్ శ్రీనును చూస్తే ఒకప్పటి కమెడియన్ చలం గుర్తుకు వస్తాడని ఆయన పేర్కొన్నారు. చిరంజీవి కామెంట్లతో రాజు యాదవ్ సినిమా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల విషయంలో అదరగొడుతుందేమో చూడాల్సి ఉంది.

చిరంజీవి తన సినిమా యూనిట్ కు ఆల్ ది బెస్ట్ చెప్పడంతో గెటప్ శ్రీను స్పందిస్తూ కల్మషం లేని మీ ప్రేమకు సదా భక్తుడిని పద్మ విభూషణ అంటూ కామెంట్ చేశారు. గెటప్ శ్రీను చేసిన కామెంట్ కు మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఈ నెల 24వ తేదీన రాజు యాదవ్ మూవీ థియేటర్లలో రిలీజ్ అవుతోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus