Pushpa2: పుష్ప2 మూవీ టీజర్ కు మెగాస్టార్ అదిరిపోయే రివ్యూ.. ఏం చెప్పారంటే?

  • April 10, 2024 / 11:52 AM IST

అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా పుష్ప ది రూల్ టీజర్ రిలీజ్ కాగా ఈ టీజర్ కు కేవలం 11 గంటల్లోనే 26 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఈ టీజర్ కు 1 మిలియన్ లైక్స్ వచ్చాయి. అయితే మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ టీజర్ గురించి స్పందించి రివ్యూ ఇచ్చారు. చిరంజీవి పుష్ప ది రూల్ టీజర్ గురించి పాజిటివ్ గా స్పందించడం బన్నీ ఫ్యాన్స్ కు మరింత సంతోషాన్ని కలిగించింది. చిరంజీవి బన్నీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు టీజర్ అద్భుతంగా ఉందని తెలిపారు.

పుష్పరాజ్ రూల్ చేస్తాడని చిరంజీవి కామెంట్ చేయడం ఫ్యాన్స్ ఆనందానికి కారణమైంది. చిరంజీవి పోస్ట్ కు బన్నీ స్పందిస్తూ థాంక్యూ సో మచ్.. టీజర్ ను మీరు ప్రశంసించడం ఆనందాన్నిచ్చిందని ఎంతో థ్రిల్ గా ఉందని కామెంట్లు చేశారు. పుష్ప ది రూల్ మూవీ 2024 సంవత్సరం ఆగష్టు నెల 15వ తేదీన ఈ సినిమా రిలీజ్ కానుందని మేకర్స్ మరోసారి కన్ఫామ్ చేయడం గమనార్హం.

టీజర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చిన నేపథ్యంలో పుష్ప2 ఫస్ట్ సింగిల్ ఎప్పుడని ఫ్యాన్స్ కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్లు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. పుష్ప ది రూల్ సినిమాలో యాక్షన్ సీన్స్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కు ప్రాధాన్యత ఉంటుందని తెలుస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు అదిరిపోయే ట్యూన్స్ ఇచ్చారని భోగట్టా. పుష్ప ది రూల్ ఇతర భాషల్లో సైతం విడుదల కానుందని తెలుస్తోంది.

పుష్ప ది రూల్ సినిమా పుష్ప ది రైజ్ ను ఎన్నో రెట్లు మించి ఉంటుందని సమాచారం అందుతోంది. సుకుమార్ ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకున్నారని సమాచారం అందుతోంది. బన్నీ సుకుమార్ కాంబినేషన్ హిట్ కాంబినేషన్ కాగా ఈ సినిమా కూడా అదే మ్యాజిక్ ను రిపీట్ చేస్తుందేమో చూడాలి. పుష్ప ది రూల్ సినిమా కోసం ఇతర భాషల సినీ ప్రేక్షకులు సైతం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus