Chiranjeevi: ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ సినిమా ఫస్ట్ చూసి ఎంజాయ్ చేసింది నేనే: చిరంజీవి

  • September 5, 2023 / 05:01 PM IST

నవీన్ పోలిశెట్టి హీరోగా అనుష్క హీరోయిన్ గా పి.మహేష్ బాబు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’. సెప్టెంబర్ 7 న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. తెలుగుతో పాటు త‌మిళ‌, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ భాష‌ల్లో ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కాబోతుంది. టీజర్, ట్రైలర్స్ కి సూపర్ రెస్పాన్స్ లభించింది. తాజాగా ఈ చిత్రాన్ని వీక్షించిన మెగాస్టార్ చిరంజీవి .. హీరో నవీన్ పోలిశెట్టిని అలాగే యూవీ క్రియేషన్స్ విక్కీ, డైరెక్టర్ పి.మహేశ్ లను పిలిచి అభినందించారు.

అనంతరం మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఈ సినిమా పై తన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ…. ” ‘మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి’ సినిమా చూశాను. మొదటి నుంచి చివరి దాకా ఎంతగానో ఆకట్టుకున్న హిలేరియస్ ఎంటర్టైనర్. నేటి యువత ఆలోచనా విధానాన్ని రిఫ్లెక్ట్ చేస్తూ తీసుకున్న సరికొత్త కధాంశం, ‘జాతి రత్నాలు’ కి రెట్టింపు ఎనర్జీ ని, వినోదాన్ని అందచేసిన నవీన్ పోలిశెట్టి, కొంచెం గ్యాప్ తర్వాత కనిపిస్తున్నా మరింత అందంగా, బ్యూటిఫుల్ గా వున్న మనందరి ‘దేవసేన’, అనూష్క శెట్టి లు ఈ చిత్రానికి ప్రాణం పోశారు.

ఫుల్ లెంగ్త్ ఎంటర్టైనర్ అవడంతో పాటు ఎమోషన్స్ ని కూడా అద్భుతంగా మిక్స్ చేసి రక్తి కట్టించేలా రూపుదిద్దిన డైరెక్టర్ మహేశ్ బాబుని అభినందించాల్సిందే. ఈ చిత్రానికి తొలి ప్రేక్షకుడిని నేనే.. ఆ హిలేరియస్ మూమెంట్స్ ఎంతగానో ఎంజాయ్ చేశాను. మరోసారి థియేటర్ లో ప్రేక్షకులందరి తోనూ ఎంజాయ్ చేయాలన్న బలమైన కోరిక నాకు కలిగింది. మిస్ శెట్టి – మిస్టర్ పోలిశెట్టి వందశాతం ఆడియన్స్ ని నవ్వుల బాట పట్టిస్తారనటంలో సందేహం లేదు!!! ” అంటూ రాసుకొచ్చారు.

మంది పార్టిసిపెంట్స్ తో దుమ్ము లేచిపోయిన బిగ్ బాస్ సీజన్ 7 స్టేజ్..!

సీజన్ – 7 లో 5 బ్లండర్ మిస్టేక్స్ ఇవే..!
‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ తో పాటు ఈ వారం విడుదల కాబోతున్న 20 సినిమాలు/సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus