Chiranjeevi: మరోసారి మెగాస్టార్ అలా కనిపించనున్నారా.. మాస్, క్లాస్ ఫ్యాన్స్ మెచ్చేలా?

టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన చిరంజీవి గత సినిమా భోళా శంకర్ బాక్సాఫీస్ వద్ద ఆశించిన రేంజ్ లో సక్సెస్ సాధించలేదనే సంగతి తెలిసిందే. ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకరకు భారీ నష్టాలను మిగిల్చింది. అయితే చిరంజీవి ఈతరం ప్రేక్షకులకు నచ్చేలా ప్రస్తుతం విశ్వంభర అనే సినిమాలో నటిస్తుండగా ఈ సినిమాపై అంచనాలు అంతకంతకూ పెరుగుతున్నాయి. అయితే ఈ సినిమాలో చిరంజీవి డ్యూయల్ రోల్ లో కనిపించనున్నారని తెలుస్తోంది.

యూవీ క్రియేషన్స్ ఈ సినిమాను నిర్మిస్తుండగా మేకర్స్ ఈ సినిమా కోసం ఐదేళ్ల లోపు వయస్సు ఉన్న ఇద్దరు పిల్లలు కావాలని పోస్ట్ పెట్టారు. మెగాస్టార్ చిన్నప్పటి రోల్స్ కోసం మేకర్స్ నుంచి ఈ మేరకు ప్రకటన వచ్చిందని తెలుస్తోంది. uvcasting14@gmail.com కు కవల పిల్లలకు సంబంధించిన వీడియోను షేర్ చేయాలని మేకర్స్ నుంచి పిలుపు వచ్చింది. 2025 సంక్రాంతి టార్గెట్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది.

చిరంజీవికి (Chiranjeevi) జోడీగా ఈ సినిమాలో త్రిష నటిస్తున్నారు. స్టాలిన్ తర్వాత ఈ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ఇదే కావడం గమనార్హం. చిరంజీవి సినిమాతో సక్సెస్ సాధిస్తే మల్లిడి వశిష్టకు మరిన్ని క్రేజీ ఆఫర్లు సొంతమవుతాయని చెప్పవచ్చు. చిరంజీవి, మల్లిడి వశిష్ట ఈ సినిమాకు రికార్డ్ స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది.

విశ్వంభర సినిమాకు ఓవర్సీస్ తో పాటు ఇతర ఏరియాలలో సైతం రికార్డ్ స్థాయిలో బిజినెస్ జరుగుతోంది. విశ్వంభరకు తెలుగు రాష్ట్రాల్లో సైతం భారీ స్థాయిలో ఆఫర్లు వస్తున్నాయి. ఈ సినిమా సక్సెస్ సాధిస్తే తెలుగులో త్రిష మరింత బిజీ అయ్యే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. స్టాలిన్ మూవీ సమయంలో చిరంజీవి త్రిష జోడీపై కొన్ని నెగిటివ్ కామెంట్లు వినిపించగా విశ్వంభర సినిమాతో ఆ విమర్శలకు సైతం చెక్ పెడతారని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

భామా కలాపం 2 సినిమా రివ్యూ & రేటింగ్!

భ్రమయుగం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజధాని ఫైల్స్ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus