Chiranjeevi, Suma: చిరు మెసేజ్ ని అవాయిడ్ చేసిన స్టార్ యాంకర్.. బయటపెట్టిన చిరంజీవి..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి నెంబర్ వన్ స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు. ఎవరి సహాయం లేకుండా స్వయం కృషితో ఎదిగి ఈ స్థాయికి చేరుకున్న చిరంజీవి అంటే అందరికీ ఎనలేని అభిమానం. ఆయన్ని ఒక్కసారి తనివి తీరా చూస్తే చాలని ఎంతోమంది అభిమానులు అనుకుంటారు. ఆయనతో కలిసి ఒక ఫోటో తీసుకోవడం కోసం ఆయన అభిమానులు ఎంతో రిస్క్ చేస్తారు. అలాంటి లెజెండరీ హీరోని ఒక యాంకర్ అవాయిడ్ చేసింది.

చిరంజీవి స్వయంగా యాంకర్ కి వరుసగా మూడు సంవత్సరాల పాటు మెసేజ్ చేసినా కూడా ఆ యాంకర్ స్పందించలేదు. అయితే చిరంజీవిని అవాయిడ్ చేసిన ఆ స్టార్ యాంకర్ మరెవరో కాదు సుమ కనకాల. ఇండస్ట్రీలో స్టార్ యాంకర్ గా గుర్తింపు పొందిన సుమ చిరంజీవి గారి మెసేజ్ చూసినా కూడా కనీసం రిప్లై ఇవ్వలేదని ఇటీవల చిరంజీవి స్వయంగా వెల్లడించాడు చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య సినిమా జనవరి 13వ తేదీ విడుదలై మంచి హిట్ టాక్ సొంతం చేసుకుని దూసుకుపోతోంది.

ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవల చిరంజీవి సుమ యాంకర్ గా వ్యవహరిస్తున్న ఒక షోలో అతిథిగా హాజరయ్యాడు. ఈ షో లో చిరంజీవి గారిని చిరు లీక్స్ ఏమైనా ఉన్నాయా? అని అడగ్గా.. చిరంజీవి స్పందిస్తూ సుమ గురించి ఉన్నాయి అంటూ చెప్పాడు. సుమ గురించి ఒక విషయం లీక్ చేయాలి అని చెబుతూ అసలు విషయం బయట పెట్టాడు. గత మూడు సంవత్సరాలుగా సుమ పుట్టినరోజున సుమకి హ్యాపీ బర్త్డే అని మెసేజ్ చేసినా కూడా సుమ ఆ మెసేజ్ చూసి కూడా రిప్లై ఇవ్వకుండా అవాయిడ్ చేసిందని చిరు ఈ సందర్భంగా సుమ గురించి లీక్ చేశాడు.

స్వయానా చిరంజీవి మెసేజ్ చేస్తే రిప్లై ఇవ్వని ఏకైక వ్యక్తి మాత్రమే అంటూ ఈ సందర్భంగా చిరంజీవి వెల్లడించాడు. చిరంజీవి తన గురించి ఇలా చెప్పటంతో సుమ స్పందిస్తూ… తన పుట్టినరోజు నాడు స్వయంగా చిరంజీవి మెసేజ్ చేస్తాడని తాను అసలు ఊహించలేదని, కనీసం ఆ నంబర్ కూడా తాను క్రాస్ చెక్ చేసుకోలేదని సుమ సమాధానం చెప్పింది. ఇక ఈ క్రమంలో చిరంజీవి స్పందిస్తూ… 2022లో ఒక ఈవెంట్లో సుమని కలిసినప్పుడు ఈ విషయం గురించి చెప్పగా తాను వెంటనే సారీ చెప్పి నా నంబర్ తీసుకుంది అంటూ చిరంజీవి వివరించారు.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus