స్టార్ హీరో చిరంజీవి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. పవన్ జనసేన పార్టీకి చిరంజీవి మద్దతు ఇవ్వకపోయినా చాలా సందర్భాల్లో చిరంజీవి పవన్ కళ్యాణ్ ను సపోర్ట్ చేశారు. తాజాగా చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పవన్ గురించి పాజిటివ్ గా మెగాస్టార్ చిరంజీవి కామెంట్లు చేయడం గమనార్హం. పవన్ కళ్యాణ్ ఏ విషయం గురించైనా స్పందిస్తే అలా స్పందించడం కరెక్ట్ అని తనకు అనిపిస్తుందని మెగాస్టార్ పేర్కొన్నారు.
పవన్ కళ్యాణ్ ఎప్పుడూ న్యాయం కోసం పోరాడతాడని చిరంజీవి చెప్పుకొచ్చారు. తాను కూడా అదే న్యాయం కొరకు మాట్లాడతానని చిరంజీవి అన్నారు. మన ఓపిక, మన సిన్సియారిటీ, మన నిజాయితీ, మన సంయమనం మనకు సక్సెస్ ను చేకూర్చి పెడతాయని చిరంజీవి చెప్పుకొచ్చారు. ఆ విషయంలో తాను ఎవరి చేత మాటలు అనిపించుకోనని మెగాస్టార్ అన్నారు. కొందరు అవసరమైన సమయంలో బుద్ధిని చూపిస్తారని మెగాస్టార్ కామెంట్లు చేశారు. తాను మాత్రం ఎదుటివారి మంచితనాన్ని కోరుకుంటానని చిరంజీవి అన్నారు.
నా పిలుపుకు అభిమానులు ముందుకొస్తే వారిలో స్పందన వ్యక్తమైందని భావిస్తానని చిరంజీవి తెలిపారు. చిరంజీవి చేసిన కామెంట్ల విషయంలో పవన్ ఫ్యాన్స్ సంతోషంగా ఫీలవుతున్నారు. పవన్ కు చిరంజీవి మద్దతు తోడైతే రాజకీయాలలో పవన్ మరింత మెరుగైన ఫలితాలు సాధిస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. భవిష్యత్తులో చిరంజీవి జనసేన పార్టీకి సంపూర్ణ మద్దతు ప్రకటించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదనే కామెంట్లు వినిపిస్తున్నాయి. మరోవైపు పవన్, చిరంజీవి కాంబినేషన్ లో మల్టీస్టారర్ వస్తే బాగుంటుందని పవన్ కళ్యాణ్ అభిమానులు కోరుకుంటున్నారు.
రాబోయే రోజుల్లో ఈ కాంబినేషన్ లో మల్టీస్టారర్ సినిమా వస్తుందేమో చూడాల్సి ఉంది. చిరంజీవి నటించిన ఆచార్య వచ్చే నెల 4వ తేదీన రిలీజ్ కానుండగా పవన్ నటించిన భీమ్లా నాయక్ ఫిబ్రవరి 25వ తేదీన రిలీజ్ కానుంది. కొన్ని రోజుల గ్యాప్ లోనే రెండు మెగా సినిమాలు థియేటర్లలో రిలీజ్ కానుండటం గమనార్హం.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!