స్వయంకృషితో ఇండస్ట్రీలో మెగాస్టార్ గా ఎదిగిన చిరంజీవి రీఎంట్రీలో కూడా వరుసగా విజయాలను సొంతం చేసుకుంటున్నారు. తాజాగా ఆచార్య ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగగా చిరంజీవి ఈ ఈవెంట్ లో తన పేరు శివశంకర వరప్రసాద్ అని శివుడు నృత్యానికి ప్రసిద్ధి కాగా శివుని ముందు ఎవరైనా డ్యాన్స్ చేయగలరా అని చిరంజీవి కామెంట్లు చేశారు. చాలామంది తాము డ్యాన్స్ చేస్తున్నామని అనుకుంటారని అయితే ఎవరైనా శివుడి తర్వాతే అని చిరంజీవి వెల్లడించారు.
ఆ శివతాండవం తర్వాతే ఎవరైనా అని చిరంజీవి చెప్పుకొచ్చారు. అప్పుడప్పుడు ఇతర హీరోలను కూడా ప్రోత్సహించాలి కాబట్టి నేను కావాలని తగ్గుతానని చిరంజీవి కామెంట్లు చేశారు. నేను తగ్గడం వల్లే వాళ్లు ఎదుగుతున్నారని చిరంజీవి వెల్లడించారు. డ్యాన్స్ విషయంలో తానే కింగ్ అని చిరంజీవి చెప్పకనే చెప్పేశారు. ఆచార్య సినిమాపై భారీస్థాయిలో అంచనాలు పెరిగాయనే సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పాన్ ఇండియా సినిమాగా విడుదల కావడం లేదు.
ఆచార్య సినిమాతో చిరంజీవి, చరణ్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరుతుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. 66 సంవత్సరాల వయస్సులో కూడా చిరంజీవి యాక్టివ్ గా ఉంటూ అద్భుతంగా డ్యాన్స్ లు చేస్తూ ప్రేక్షకులు ఫిదా అయ్యేలా చేస్తున్నారు. ఆచార్య సినిమా కొత్త తరహా కథాంశంతో తెరకెక్కగా ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందో చూడాలి. చిరంజీవి, చరణ్ లను హైలెట్ చేస్తూ ఈ సినిమాకు ప్రమోషన్స్ ను నిర్వహిస్తున్నారు.
చిరంజీవి, చరణ్ రెమ్యునరేషన్ తీసుకోకుండానే ఆచార్య సినిమాలో నటించడం గమనార్హం. ఆచార్య సినిమాకు బాక్సాఫీస్ వద్ద ఏ సినిమా నుంచి పోటీ ఎదురుకావడం లేదు. ఈ సినిమాకు పోటీగా భళా తందనాన సినిమాను విడుదల చేస్తామని ఆ సినిమా నిర్మాతలు ప్రకటించినా చివరి నిమిషంలో వెనక్కు తగ్గారు. 2022 సంవత్సరంలో పెద్ద సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలుస్తున్నాయి.
Most Recommended Video
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!