దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి చిత్రాలు ప్రతి భారతీయుడిని గర్వపడేలా చేశాయి. భారీ కలక్షన్స్ తో పాటు ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాయి. సినీ పరిశ్రమల వారికీ స్ఫూర్తిగా నిలిచాయి. అలా స్ఫూర్తి పొందిన వారిలో చిరంజీవి కూడా ఉన్నారు. అయన ఈ చిత్రాన్ని కేవలం ఇన్స్పిరేషన్ గా మాత్రమే తీసుకోవడం లేదు. ఒక లక్ష్యంగా చేసుకున్నారు. బాహుబలి కంక్లూజన్ నమోదు చేసిన రికార్డులను బద్దలు కొట్టాలని శ్రమిస్తున్నారు. ఆ విషయం తన ప్రస్తుత సినిమా విషయంలో స్పష్టంగా తెలుస్తోంది. దేశం మొత్తం కనెక్ట్ అయ్యేలా స్వాతంత్ర సమరయోధుడు ఉయ్యాల వాడ నరసింహా రెడ్డి జీవితాన్ని కథగా ఎంచుకున్నారు. అంతర్జాతీయంగా పేరున్న, ఆస్కార్ అవార్డు అందుకు ఏ ఆర్ రెహమాన్ ని మ్యూజిక్ డైరక్టర్ గా తీసుకున్నారు.
ఇక సౌత్, నార్త్ లో ఈ చిత్రం బాగా ఆడాలని బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్, కన్నడ సూపర్ స్టార్ సుదీప్, కోలీవుడ్ సూపర్ హీరో విజయ్ సేతు పతిలకు కీలక రోల్స్ అందించారు. అలాగే విజువల్ ఎఫక్ట్స్ పనులను మగధీర, బాహుబలికి సేవలు అందించిన కన్నల్ కణ్ణన్ కు అప్పగించారు. ఒక భాషలో ఒక టైటిల్ కాకుండా అన్ని భాషల్లో ఒకే టైటిల్ ఉండే విధంగా మహా వీర అనే టైటిల్ ని పరిశీలిస్తున్నారు. ఈ టైటిల్ ని రాజమౌళి చేతుల మీదుగా ఆవిష్కరించడానికి సిద్ధమవుతున్నారు. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినీ నిర్మాణం సాగాలని సొంత కొణిదెల ప్రొడక్షన్ బ్యానర్లోనే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ జాగ్రత్తలను బట్టి చూస్తే బాహుబలి రికార్డ్స్ పైనే చిరు గురి ఉన్నట్టు తెలుస్తోంది.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.