హీరోలు వాణిజ్య ప్రకటనల్లో నటించడం, బ్రాండ్ అంబాసిడర్‌లుగా ఉండటం తెలుగు చలన చిత్ర పరిశ్రమకు కొత్తేం కాదు. అప్పుడెప్పుడో ఎస్వీ రంగారావు టైమ్ నుండే అలాంటివి ఉన్నాయి. అయితే అదంతా అప్పుడు. ఇటీవల కాలంలో వాణిజ్య ఉత్పత్తికి బ్రాండ్ అంబాసిడర్ అంటే… చిరంజీవే అని చెప్పాలి. థమ్సప్, నవరత్న అంటూ కొన్ని బ్రాండ్‌లకు చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నారు. ఆ తర్వాత వివిధ కారణాల వల్ల వాటికి దూరమయ్యారు. అయితే ఇన్నాళ్లు అంటే సుమారు 12 – 13 ఏళ్ల తర్వాత చిరంజీవి మళ్లీ బ్రాండ్ అంబాసిడర్ అవతారం ఎత్తుతున్నారు.
ఓ ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండమని చిరంజీవిని కోరిందట. దీంతో చిరంజీవి ఆ డీల్‌కు ఓకే చెప్పారని సమాచారం. దీని కోసం చిరంజీవి పెద్ద ఎత్తున పారితోషికం ముట్ట జెప్పుతున్నారని టాక్. త్వరలోనే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించనున్నారు. ప్రస్తుతం మెగా కుటుంబంలో ప్రకటనలు అందులోనూ రియల్ ఎస్టేట్ వ్యాపారానికి ప్రచారం చేస్తున్న వారిలో నాగబాబు, రామ్‌చరణ్ ఉన్నారు. ఇప్పటికే వీరిద్దరూ ఈ ప్రకటనల్లో నటించారు. ఇప్పుడు చిరంజీవి కూడా ఆ రంగం ప్రకటనలో నటించనున్నారు.
త్వరలోనే యాడ్ చిత్రీకరణ ఉంటుందని టాక్. దీంతో తండ్రీ కొడుకులిద్దరూ సినిమాలతోపాటు ప్రకటనల్లోనూ పోటీ పడబోతున్నారన్నమాట. చిరంజీవి ప్రస్తుతం యువ స్టార్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. ‘ఆచార్య’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉండగా… ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ సెట్స్ మీద ఉన్నాయి. దీంతోపాటు బాబీ సినిమా కూడా ఇటీవల మొదలైంది. యువ దర్శకుడు వెంకీ కుడుముల సినిమాను కూడా ఇటీవల అనౌన్స్ చేశారు. కరోనా నుండి కోలుకున్న చిరంజీవి ‘గాడ్‌ఫాధర్’ చిత్రీకరణ ప్రారంభించారు.
మరోవైపు చిరంజీవి తెలుగు చలన చిత్ర పరిశ్రమ సమస్యలపై ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నారు. సినిమా పెద్దలతో కలసి త్వరలో ఏపీ సీఎం జగన్‌మోహన్‌రెడ్డిని కలవనున్నారు. దీంతో ఇటు సినిమాలు, అటు ప్రకటనలు, ఇటు సినిమా పరిశ్రమ సమస్యలతో చిరంజీవి బిజీ అయిపోయాడు.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!