Roshan Kanakala: నాని చెప్పినట్టు స్టార్ హీరోలను రంగంలోకి దించుతున్న సుమ!

ప్రముఖ యాంకర్ సుమ కొడుకు త్వరలోనే హీరోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. బబుల్ గమ్ అనే సినిమా ద్వారా ఈయన హీరోగా రాబోతున్నారు. ఇక తన కొడుకు సినిమా కోసం సుమ కూడా పెద్ద యెత్తున కష్ట పడుతున్నారు. ఈమె ఏ కార్యక్రమానికి వెళ్ళిన తన కొడుకును కూడా వెంట తీసుకెళ్తూ పెద్ద ఎత్తున తన కొడుకు సినిమాను ప్రమోట్ చేస్తూ ఉన్నారు.ఇకపోతే ఇప్పటికే ఈ సినిమా నుంచి జిలేబి అనే సాంగ్ విడుదలైన సంగతి మనకు తెలిసిందే.

ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది. త్వరలోనే రెండో పాటను కూడా విడుదల చేయబోతున్నారు అయితే ఈ సాంగ్ లంచ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి హాజరు కాబోతున్నారు. ఇలా చిరంజీవి చేతుల మీదుగా తన కొడుకు సినిమాలోని రెండో పాట విడుదల కానుంది. సుమా తన కొడుకు సినిమా కోసం చిరంజీవి రావడంతో గతంలో నాని చెప్పిన వ్యాఖ్యలు నిజం అవుతున్నాయి.

స్టార్ హీరోలు అందరి సినిమాలను హోస్ట్ చేసే సుమ తన కొడుకు (Roshan Kanakala) సినిమా కోసం స్టార్ హీరోలందరూ రంగంలోకి దిగుతారని గతంలో నాని చెప్పరు. ఇలా నాని చెప్పిన విధంగానే సుమ కొడుకు సినిమా కోసం చిరంజీవి గారు కూడా రంగంలోకి దిగారు. బబుల్‌గమ్ సినిమా నుంచి రెండో పాట ఇజ్జత్ ఈనెల 23న విడుదలకానుంది.

ఈ పాటను స్వయంగా చిరంజీవి లాంచ్ చేయబోతున్న నేపథ్యంలో రోషన్ కనకాల సినిమాకు మరింత క్రేజ్ వస్తుందని చెప్పాలి. ఇక ఈ సినిమాకు రవికాంత్ పేరేపు దర్శకత్వం వహిస్తున్నారు. ఏది ఏమైనా తన కొడుకు సినిమా కోసం మాత్రం టాలీవుడ్ హీరోలు అందరినీ సుమ ఏకం చేస్తున్నారని చెప్పాలి.

మంగళవారం సినిమా రివ్యూ & రేటింగ్!

స్పార్క్ సినిమా రివ్యూ & రేటింగ్!
సప్త సాగరాలు దాటి సైడ్ బి సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus