Chiranjeevi, Anudeep: ‘జాతి రత్నాలు’ దర్శకుడు మామూలోడు కాదు..!

‘పిట్టగోడ’ అనే సినిమాతో దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. ‘జాతి రత్నాలు’ (Jathi Ratnalu) తోనే ఫోకస్ లోకి వచ్చాడు దర్శకుడు కె.వి.అనుదీప్ (Anudeep Kv) . ఆ సినిమాతో నిర్మాతకి కానీ బయ్యర్స్ కి కానీ భారీ లాభాలు తెప్పించాడు. అంతేకాదు డబుల్ మీనింగ్ డైలాగ్స్ లేకుండా హెల్దీ కామెడీని అందించగలను అని ప్రూవ్ చేసుకున్నాడు. కేవలం సినిమాల్లోనే కాదు.. ఏదైనా ఈవెంట్ కి వచ్చినప్పుడు అనుదీప్ ఇచ్చే స్పీచ్ కూడా చాలా కామెడీగా అనిపిస్తుంది.’జాతి రత్నాలు’ తర్వాత శివ కార్తికేయన్ ని (Sivakarthikeyan) ఒప్పించి ‘ప్రిన్స్’ అనే సినిమా చేశాడు అనుదీప్.

కానీ అది ఎక్కడో తేడా కొట్టేసింది.అందుకే బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసింది. అయినప్పటికీ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ కి రవితేజ వంటి మాస్ హీరోని పట్టేశాడు. ‘సితారా ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ పై నాగ వంశీ (Suryadevara Naga Vamsi) ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉంది. త్వరలోనే సెట్స్ పైకి వెళ్తుంది. స్క్రిప్ట్ రెడీ అయిపోయింది కాబట్టి.. షూటింగ్ మొదలైతే 3 నెలల్లోపు ఫినిష్ అయిపోతుంది. అందుకే ఇప్పుడు నెక్స్ట్ స్క్రిప్ట్ పై దృష్టి పెట్టాడు అనుదీప్. తన దగ్గర ఉన్న కథతో ఇటీవల చిరంజీవిని (Chiranjeevi) అప్రోచ్ అయ్యాడట.

చిరంజీవి కూడా అనుదీప్ కథకి పాజిటివ్ గా రియాక్ట్ అయ్యారు. చిరు కొత్త దర్శకులతో పని చేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారు. సో అనుదీప్ కి ఛాన్స్ రావడం అనేది వింత కాదు. కాకపోతే స్క్రిప్ట్ తో ఆయన్ని ఒప్పించడం అనుదీప్ కి పెద్ద పని లాంటిది. అయినా సరే అనుదీప్ లో కూడా ఆ టాలెంట్ ఉంది. ఎలాంటి హీరోని అయినా ఒప్పించి ప్రాజెక్టు సెట్ చేసుకోగలడు. కాబట్టి.. ఈ కాంబో సెట్ అయ్యే ఛాన్సులు లేకపోలేదు. కానీ ఎప్పుడు సెట్ అవుతుంది అనేది మాత్రం పెద్ద సస్పెన్స్ అంతే..!

ఘనంగా హీరోయిన్ మీరా చోప్రా పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు

భర్తకు షాకిచ్చిన సీరియల్ నటి.. ఏమైందంటే?
సిద్ధు జొన్నలగడ్డ ఆ హీరోయిన్ ను పెళ్లి చేసుకోనున్నారా.. ఏం జరిగిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus