Chiranjeevi: సర్జరీ కోసం విదేశాలకు వెళ్లనున్న మెగాస్టార్!

మెగాస్టార్ చిరంజీవి ఆరోగ్యం గురించి గత కొద్దిరోజులుగా పెద్ద ఎత్తున వార్తలు వస్తున్న విషయం మనకు తెలిసిందే. చిరంజీవి ఏడుపదుల వయసులోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ క్రమంలోనే వరుస సినిమాలలో నటిస్తూ ఏడాదికి రెండు మూడు సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి చిరంజీవికి గత కొంతకాలంగా మోకాలు నొప్పి సమస్యతో బాధపడుతున్నారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే మోకాలి నొప్పి నుంచి ఉపశమనం కలగడం కోసం వైద్యులు తనకు సర్జరీ చేయాలని సూచించడంతో చిరంజీవి త్వరలోనే సర్జరీ కోసం సిద్ధమవుతున్నారని తెలుస్తుంది.

అయితే ఇప్పటికే చిరంజీవిని (Chiranjeevi) పరీక్షించినటువంటి వైద్యులు త్వరలోనే ఈయనకు సర్జరీ చేయాలని తెలియజేశారట అయితే మరి ఆ సర్జరీ హైదరాబాద్లోనే జరుగుతుందా లేక విదేశాలకు వెళ్తున్నారా అనే విషయం మాత్రం తెలియాల్సి ఉంది. ఈ విధంగా చిరంజీవి మోకాలు నొప్పి సమస్య నుంచి ఉపశమనం పొందిన తర్వాతే కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ చేయబోతున్నట్లు సమాచారం. చిరంజీవి తాజాగా మెహర్ రమేష్ దర్శకత్వంలో నటించిన భోళా శంకర్ సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.

ఈ సినిమా ఎన్నో అంచనాల నడుమ విడుదలైనప్పటికీ డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా సమయంలోనే చిరంజీవి కాస్త మోకాలి విషయంలో ఇబ్బందులు పడ్డారని త్వరలోనే ఈయన సర్జరీకి వెళ్లబోతున్నారని అప్పటివరకు కొత్త ప్రాజెక్ట్ ప్రకటించబోరని తెలుస్తోంది. ఈ సినిమా తర్వాత చిరంజీవి తన తదుపరి చిత్రాన్ని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో తన కుమార్తె సుస్మిత నిర్మాణంలో చేయబోతున్నట్లు సమాచారం ఈ సినిమా కూడా రీమేక్ సినిమా కావడం విశేషం.

ఈ సినిమా తమిళ బ్రో డాడీ సినిమాకు రీమెక్ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అన్ని విషయాల గురించి చర్చలు జరిగాయని చిరంజీవి సర్జరీ తర్వాతే ఈ సినిమా గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయబోతున్నారని సమాచారం.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus