Chiranjeevi: ఇంకో మెగా మూవీ.. మల్టీస్టారర్ గా మారబోతుందట..!

మెగాస్టార్ చిరంజీవి నటించిన లేటెస్ట్ మూవీ ‘ఆచార్య’ ఏప్రిల్ 29న అంటే మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కొరటాల శివ దర్శకుడు కావడం పైగా రాంచరణ్ కూడా ఓ ప్రాముఖ్యమైన పాత్ర చేయడంతో ఈ సినిమా పై అంచనాలు పెరిగాయి. ఇక ఈ చిత్రం చేస్తూనే ‘గాడ్ ఫాదర్’, ‘భోళా శంకర్’ వంటి చిత్రాల్లో కూడా నటిస్తున్నారు మెగాస్టార్. ఈ రెండు మూవీస్ కూడా సెట్స్ పై వున్నాయి.

Click Here To Watch NOW

అలాగే బాబీ దర్శకత్వంలో కూడా చిరు ఓ సినిమా చేయబోతున్నారు. ఈ మధ్యనే ఆ మూవీ షూటింగ్ స్టార్ట్ అయ్యింది. మెగాస్టార్ పై కొన్ని యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించారు.దీంతో పాటు వెంకీ కుడుముల దర్శకత్వంలో కూడా ఓ సినిమా చేయడానికి చిరు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రస్తుతం ఆ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. ‘భోళా శంకర్’ తీసేస్తే చిరు హీరోగా నటిస్తున్న ఈ సినిమాల్లో మరో హీరో కూడా నటిస్తున్నారు.

బాబీ మూవీలో రవితేజ నటిస్తున్నాడు, గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు. ఇప్పుడు వెంకీ కుడుముల దర్శకత్వంలో చిరు చేస్తున్న మూవీలో కూడా కథ ప్రకారం మరో హీరో నటించాల్సి ఉందట. ఇది ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. సొసైటీలోని ఓ ఇష్యూని చాలా కమర్షియల్ వేలో చూపించబోతున్నారట. ఇప్పుడు ఈ చిత్రంలో మరో హీరో కోసం వేట మొదలైంది.

ఇందులో నితిన్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్టు వినికిడి. అయితే ఇంకా ఎవ్వరినీ ఫైనల్ చేయలేదు.మరికొన్ని రోజుల్లో ఈ విషయం పై క్లారిటీ వస్తుంది.రష్మిక కూడా ఈ మూవీలో చిన్న పాత్ర పోషిస్తున్నట్లు మొన్నామధ్య టాక్ నడిచింది.

‘కె.జి.ఎఫ్2’ నుండీ అదిరిపోయే 23 డైలాగులు ఇవే..!

Most Recommended Video

‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు ఫస్ట్ వీక్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వసూళ్ళను రాబట్టిన సినిమాల లిస్ట్..!
తెలుగులో అత్యధిక థియేట్రికల్ బిజినెస్ చేసిన సినిమాల లిస్ట్..!
‘ఆర్.ఆర్.ఆర్’ తో పాటు బాక్సాఫీస్ వద్ద భారీ లాభాలను అందించిన 10 సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus