Chiranjeevi, Srikanth: చిరంజీవి ప్రేమ అమృతం.. శ్రీకాంత్ బర్త్ డే రోజున అలా చేశారా?

టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఇండస్ట్రీలో అందరివాడిగా గుర్తింపును సంపాదించుకున్నారు. ఎవరు కష్టంలో ఉన్నా ఆదుకునే విషయంలో చిరంజీవి ముందువరసలో ఉంటారు. ఎంతోమందికి చిరంజీవి తన వంతు సహాయసహకారాలు అందించారు. చిరంజీవికి ఇండస్ట్రీలో అత్యంత సన్నిహితులలో శ్రీకాంత్ (Srikanth) ఒకరు కాగా నిన్న శ్రీకాంత్ పుట్టినరోజు వేడుకను జరుపుకున్నారు. అయితే శ్రీకాంత్ పుట్టినరోజు సందర్భంగా చిరంజీవి చేసిన పని ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ అవుతోంది. చిరంజీవి శ్రీకాంత్ పుట్టినరోజును గుర్తు పెట్టుకుని స్వయంగా శ్రీకాంత్ ఇంటికి వెళ్లి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

హ్యాపీ బర్త్ డే శ్రీకాంత్.. లవ్ ఫ్రమ్ అన్నయ్య అనే కేక్ ను శ్రీకాంత్ తో కట్ చేయించి చిరంజీవి శ్రీకాంత్ పై తనకు ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు. శ్రీకాంత్ కుటుంబంతో చిరంజీవి కొంత సమయం గడిపారు. చిరంజీవి మంచి మనస్సును ఎంత మెచ్చుకున్నా తక్కువేనని నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా కామెంట్లు చేస్తున్నారు. చిరంజీవి ఫ్యాన్ ట్విట్టర్ వేదికగా ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయగా ఆ ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి, శ్రీకాంత్ కాంబినేషన్ లో మరిన్ని సినిమాలు రావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సీనియర్ హీరోలైన చిరంజీవి, బాలయ్య (Balakrishna), వెంకటేశ్ (Venkatesh), నాగార్జునలతో (Nagarjuna) కలిసి నటించిన అతికొద్ది మంది హీరోలలో శ్రీకాంత్ ఒకరు. ప్రస్తుతం దేవర  (Devara) సినిమాలో నటిస్తున్న శ్రీకాంత్ ఈ సినిమాలో జాన్వీ కపూర్ (Janhvi Kapoor)  తండ్రి పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది. ఈ సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి.

చిరంజీవి కెరీర్ విషయానికి వస్తే విశ్వంభర (Vishwambhara) మినహా మెగాస్టార్ చిరంజీవి మరో ప్రాజెక్ట్ ను ప్రకటించలేదు. చిరంజీవి ప్రేమ అమృతం అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా అభిప్రాయపడుతున్నారు. విశ్వంభర పూర్తయ్యాకే మెగాస్టార్ కొత్త ప్రాజెక్ట్ లను ప్రకటించే ఛాన్స్ ఉంది. చిరంజీవి హాజరై సర్ప్రైజ్ ఇవ్వడంతో శ్రీకాంత్ కుటుంబ సభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.

ఓం భీమ్ భుష్ సినిమా రివ్యూ & రేటింగ్!!

లైన్ మ్యాన్ సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రముఖ బిగ్ బాస్ కంటెస్టెంట్ అరెస్ట్.. మేటర్ ఏంటి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus