సంక్రాంతి సందర్భంగా ఏదైనా కొత్త పోస్టర్‌తో విషెష్ చెబుతారేమో అని ఎదురు చూస్తున్న మెగా ఫ్యాన్స్‌కు మ్యాట్నీ ఎంటర్‌టైన్మెంట్స్ షాక్ ఇచ్చింది. సినిమా పోస్టర్ సంగతి పక్కనపెడితే ఏకంగా సినిమానే వాయిదా అంటూ ప్రకటన ఇచ్చి షాక్‌కి గురి చేసింది. ఫిబ్రవరి 4 ‘ఆచార్య’ రావడం లేదు అంటూ పోస్టర్ రిలీజ్ చేశారు. అంతేకాదు కొత్త డేట్ ఎప్పుడు అనేది కూడా ప్రకటించలేదు. దీంతో ఒక్కసారి అభిమానులు నిరుత్సాహపడ్డారు. అయితే ఒక రోజు గ్యాప్‌లో ఆ నిరుత్సాహాన్ని చెరిపేసింది. అవును సినిమా కొత్త డేట్ వచ్చేసింది.
‘ఆచార్య’ను ఏప్రిల్ 1న విడుదల చేస్తాం అంటూ కొత్త తేదీని కనుమ శుభాకాంక్షలతో తెలియజేసింది చిత్రబృందం. దీంతో రిలీజ్ డేట్ తెలియక ఆందోళన పడుతున్న ఫ్యాన్స్‌కు ఊపిరి వచ్చినట్లయింది. అంటే సుమారు రెండు నెలల పాటు సినిమాను వాయిదా వేశారు. అప్పటికి కరోనా పరిస్థితులు కుదుట పడొచ్చని వార్తలొస్తున్న నేపథ్యంలో ఆ తేదీని ఎంచుకున్నారు. అంతేకాదు ఆ రోజు సినిమా ఉగాది పర్వదినం నేపథ్యంలో వస్తుంది. కాబట్టి వసూళ్లు బాగుంటాయని చిత్రబృందం భావించిందని సమాచారం.
ముందుగా చెప్పుకున్నట్లు ఈ సినిమా ఫిబ్రవరి 4న విడుదల కావాల్సింది. అయితే దేశంలో కరోనా పరిస్థితులు ఇంకా మెరుగవ్వకపోవడం, ఏపీలో సినిమా టికెట్ల ధరల లెక్క తేలకపోవడం, దక్షిణాది రాష్ట్రాల ప్రభ్వుత్వాలు కరోనా ఆంక్షలు పెంచుతాయని వార్తలు వచ్చిన నేపథ్యంలో సినిమాను వాయిదా వేశారు. ఈ సినిమాలో చిరుకు జోడీగా కాజల్, రామ్‌చరణ్ సరసన పూజా హెగ్డే కనిపిస్తుంది. మణిశర్మ సంగీతమందిస్తున్న ఈ చిత్రానికి కొరటాల శివ దర్శకుడు.
ఏప్రిల్ 1న ‘ఆచార్య’ సినిమా రిలీజ్ అంటే… ఈ పాటి మీకు ఒక డౌట్ వచ్చి ఉండాలి. అదే ‘సర్కారు వారి పాట’. మహేష్ బాబు నటిస్తున్న ఈ సినిమను ఆ రోజే విడుదల చేస్తామని చిత్రబృందం గతంలోనే ప్రకటించింది. ఇప్పుడు ‘ఆచార్య’ ఆ తేదీన వస్తుండటంతో… మహేష్‌బాబు సినిమా వాయిదా పడొచ్చని వార్తలొస్తున్నాయి. సినిమా మేజర్ పార్ట్ చిత్రీకరణ బ్యాలెన్స్ ఉండటం, మరోవైపు ఇప్పట్లో షూటింగ్‌లు జరిగే పరిస్థితి లేకపోవడంతో ఆ సినిమా వాయిదా పడుతుంది అంటున్నారు. ఆ లెక్కన చిరంజీవి ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్, మహేష్ అభిమానులకు బ్యాడ్ న్యూస్ అనొచ్చు.
Most Recommended Video
ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!