టాలీవుడ్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి ఆ తరువాత మెగాస్టార్ గా ఎదిగారు చిరంజీవి. ఇప్పుడు సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి మెగాఫ్యామిలీ ఎదిగిందంటే అదంతా చిరంజీవి పడ్డ కష్టమే. మెగాస్టార్ తండ్రి ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారనే విషయం అందరికీ తెలిసిందే. అయితే ఆయన కూడా నటుడిగా సినిమాలు చేశారనే విషయం చాలా మందికి తెలియదు. చిరు సినిమాల్లోకి రాకముందే 1969లో విడుదలైన ‘జగత్ కిలాడీ’ అనే సినిమాలో మెగాస్టార్ తండ్రి వెంకట్రావు గారు చిన్న పాత్రలో కనిపించారు.
ఆ తరువాత ఆయనకి మరిన్ని అవకాశాలు వచ్చినా.. కుటుంబ బాధ్యతల కారణంగా ఉద్యోగానికే పరిమితం కావాల్సి వచ్చింది. ఈ క్రమంలో ఆయన పెద్ద కుమారుడు చిరంజీవిని సినిమాల దిశగా ప్రోత్సహించారు. చిరు నటించిన ఓ సినిమాలో వెంకట్రావు కూడా నటించి కొడుకుతో నటించాలనే కోరికను తీర్చుకున్నారు. ఆ సినిమా ఏంటంటే ‘మంత్రిగారి వియ్యంకుడు’. బాపు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో మంత్రి పాత్రకు సూటయ్యే నటుడి కోసం వెతుకుతున్న సమయంలో
అల్లు రామలింగయ్య వెంటనే బాపు దగ్గరకి వెళ్లి వెంకట్రావు పేరు సూచించారట. దానికి బాపు ఓకే చెప్పడంతో సినిమాలో మంత్రి పాత్రలో వెంకట్రావు నటించారు. ఈ సినిమాలో చిరు, వెంకట్రావుల మధ్య సన్నివేశాలు ఉండవు కానీ.. ఒకే సినిమాలో నటించామనే తృప్తి వెంకట్రావుకి ఉండేదట.