అలయ్ బలాయ్ కార్యక్రమానికి మెగాస్టార్ చిరంజీవి, గరికపాటి అతిథులుగా వెళ్లిన సంగతి తెలిసిందే. అక్కడ చిరంజీవి కొంతమంది మహిళా అభిమానులతో ఫోటోలు, సెల్ఫీలు దిగుతుంటే.. గరికపాటి ఫైర్ అయిన సంగతి తెలిసిందే. చిరంజీవి గారు ఆ ఫోటోల సెషన్ ఆపకపోతే నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతాను అంటూ ఆయన మండిపడ్డారు. గరికపాటి అలా మండిపడినప్పటికీ చిరంజీవి ఆయన మాటకు మర్యాద ఇచ్చి, ఆయన వద్దకు వచ్చి నమస్కరించి నవ్వుతూ మాట్లాడారు.
మైక్ పట్టుకున్న తర్వాత గరికపాటి గొప్పతనం గురించి చెప్పుకొచ్చారు. అక్కడితో అంతా అయిపోయింది అనుకుంటున్న టైంలో గతంలో ప్రజారాజ్యం పార్టీ గురించి గరికపాటి ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే లో సెటైర్లు వేసిన వీడియోని బయటకు తీసి మెగా అభిమానులు ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఇది చిలికి చిలికి గాలి వాన అయ్యింది. తర్వాత నాగబాబు కూడా ఈ విషయంపై స్పందించడం దీంతో ఈ టాపిక్ ఇంకా వైరల్ అవ్వడం జరిగింది.
పెద్దలు మాట్లాడుతున్నప్పుడు మిగిలిన వారు వినకపోతే గద్దించడం మామూలే. దానికి ఇంత సీన్ క్రియేట్ చేసింది చిరు ఫ్యాన్సా? లేక యాంటీ ఫ్యాన్సా అన్నది క్లారిటీ రాలేదు. సరే ఈ విషయాన్ని పక్కన పెట్టేస్తే.. ‘గాడ్ ఫాదర్’ ప్రమోషన్స్‌లో చిరు కూడా ‘గరికపాటి వ్యాఖ్యలను వివాదాస్పదం చేయనవసరం లేదు’ అంటూ ఈ విషయానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు. అక్కడి వరకు బాగానే ఉంది.. కానీ నిన్న చిరంజీవి..
సీనియర్ జర్నలిస్ట్ ప్రభు చిరు జీవిత ప్రస్థానాన్ని వర్ణిస్తూ రాసిన ఓ బుక్ లాంచ్ ఈవెంట్ కు వెళ్లారు. అక్కడ మహిళా అభిమానులంతా చిరంజీవి వద్దకు ఫోటోల కోసం వచ్చారు. ‘ఇక్కడ వారు లేరు కదా?’ అంటూ పరోక్షంగా గరికపాటి పై సెటైర్లు వేశారు. ‘వారు లేరు కదా? హమ్మయ్య అయితే ఓకే’ అంటూ చిరు వేసిన సెటైరికల్ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో పై గరికపాటి స్పందించకపోతే ప్రాబ్లమ్ లేదు స్పందిస్తే మళ్ళీ విషయం పెద్దదవుతుంది.
Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!