2026 సంక్రాంతికి ఎక్కువ బజ్ ఉన్న సినిమాగా ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ నిలిచింది. దీనికి ప్రధాన కారణం అనిల్ రావిపూడికి సంక్రాంతి ట్రాక్ రికార్డు బాగుండటం. అలాగే మెగాస్టార్ చిరంజీవి(Chiranjeevi) కొంత గ్యాప్ తర్వాత ఫ్యామిలీస్ కి నచ్చే కామెడీ సినిమాగా ‘మన శంకర్ వర ప్రసాద్’ చేయడం.అలాగే ‘సంక్రాంతికి వస్తున్నాం’ తో పెద్ద బ్లాక్ బస్టర్ అందుకున్న వెంకటేష్ ఈ సినిమాలో గెస్ట్ రోల్ చేయడం మరో కొసమెరుపు.
సాధారణంగా సంక్రాంతికి ఫ్యామిలీ ఎలిమినెంట్స్ అలాగే కామెడీ కలిగిన సినిమాలకే ఆడియన్స్ కూడా పెద్దపీట వేస్తుంటారు. అందుకే ‘మన శంకర్ వర ప్రసాద్’ కి కావాల్సినంత బజ్ ఏర్పడింది. కాకపోతే ఈ సినిమా ప్రమోషన్స్ కి మెగాస్టార్ చిరంజీవి దూరంగా ఉండటం కొంత టాక్ ఆఫ్ ది టౌన్ అయ్యింది.’ ‘వాల్తేరు వీరయ్య’ సినిమా టైంలో ఎగబడి ప్రమోషన్ చేసిన చిరు.. ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ విషయంలో ఎందుకు దూరంగా ఉన్నట్టు?’ ఈ ప్రశ్న చాలా మంది మైండ్లో ఉంది.

ఏ సినిమాకి అయినా హీరో ముందుకొచ్చి ప్రమోట్ చేస్తే.. దానికొచ్చే రీచ్ వేరు. ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమాకి వెంకటేష్ ప్రమోషన్స్ కి సహకరించబట్టే.. దాని రిజల్ట్ కూడా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళింది. ఇవి చిరుకి తెలియని విషయాలు కాదు. మరి ఎందుకు సైలెంట్ గా ఉన్నారు? అంటే.. ఇటీవల చిరుకి చిన్న శస్త్రచికిత్స జరిగింది. ప్రస్తుతం ఆయన విశ్రాంతి తీసుకుంటున్నారు.
అందుకే ప్రమోషన్స్ కి దూరంగా ఉన్నారు. అయితే ఈ వారం నిర్వహించే ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరు హాజరు కానున్నారు. అలాగే కొన్ని కామన్ ఇంటర్వ్యూల్లో కూడా చిరు పాల్గొనే అవకాశం ఉంది.
