‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమా టీమ్ నుండి ఇప్పటివరకు రెండు పాటలు వచ్చాయి. ఆ లిరికల్ వీడియోలకు యూట్యూబ్‌లో, సోషల్ మీడియాలో మిలియన్ల వ్యూస్ వస్తున్నాయి. అంతగా ఇంపాక్ట్ చూపించాయి ఆ పాటలు. ఇప్పుడు మరో పాట ఆ లిస్ట్‌లో చేరడానికి రెడీ అవుతోంది. తొలి రెండు పాటలకు వచ్చిన వ్యూస్, హైప్‌కి డబుల్ ఈ పాట ఇస్తుందని చెప్పేయొచ్చు. ఎందుకంటే ఈ సారి వచ్చే పాటలో ఇద్దరు హీరోలు కనిపించబోతున్నారు. అందులో ఇద్దరూ డ్యాన్స్‌లేశారు కాబట్టి.
మెగాస్టార్ చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ‘మన శంకర్‌వరప్రసాద్ గారు’ సినిమాలో విక్టరీ వెంకటేశ్ ఓ కీలక పాత్రలో నటించిన విషయం తెలిసిందే. తొలుత అతిథి పాత్ర అనుకున్నా.. ఆ తర్వాత పాత్ర నిడివిని పెంచారనే విషయం తెలిసిందే. ఉన్న ఆ స్క్రీన్ టైమ్‌లో ఓ పాటను కూడా పెట్టారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఆ పాటలో ఇద్దరు అగ్ర హీరోల డ్యాన్స్ హైలైట్‌గా నిలుస్తుందని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఆ పాట లిరికల్ వీడియోనే ఇప్పుడు రిలీజ్ చేయబోతున్నారు.

కొత్త సంవత్సరం కానుకగా ఆ పాటను రిలీజ్ చేసే ప్లానింగ్‌లో ఉన్నారని సమాచారం. సినిమా నుండి వచ్చే ఆఖరి పాట కూడా ఇదే అని చెబుతున్నారు. చిరంజీవి, వెంకటేష్ కలసి డ్యాన్స్ చేసిన ఓ పాట త్వరలోనే రిలీజ్ చేస్తామని ‘శంబాల’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో అనిల్ రావిపూడి అఫీషియల్‌గా చెప్పారు కూడా. మరి ఈ పాట ఎలా ఉండబోంది, స్టెప్పులెలా వేశారు లాంటి వాటి గురించి ఇద్దరు హీరోల అభిమానులు అంచనాలు వేసుకోవడం స్టార్ట్ చేయాల్సిందే.
నయనతార, కేథరిన్ థ్రెసా ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ సినిమాను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేయనున్నారు. ఈ సినిమాను సాహు గారపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
