Chirutha Collections: ‘చిరుత’ కి 15 ఏళ్లు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

మెగా పవర్ స్టార్ రాంచరణ్ హీరోగా పరిచయమవుతూ చేసిన చిత్రం ‘చిరుత’. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘వైజయంతీ మూవీస్’ బ్యానర్ పై సి.అశ్వినీదత్ నిర్మించారు. 2007వ సంవత్సరం సెప్టెంబర్ 28న ఈ మూవీ రిలీజ్ అయ్యింది. మొదటి షోతోనే సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకున్న ఈ మూవీ ఫుల్ రన్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇక ఈ చిత్రం రిలీజ్ అయ్యి ఈరోజుతో 15 ఏళ్ళు పూర్తయ్యింది.

అంటే రాంచరణ్ హీరోగా పరిచయమై 15 ఏళ్ళు పూర్తి కావస్తోంది. దీంతో సోషల్ మీడియాలో ‘#15YearsOfRamCharan’ ‘#15YearsOfChirutha ‘ వంటి హ్యాష్ ట్యాగ్ లు ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ‘చిరుత’ క్లోజింగ్ కలెక్షన్స్ ని గమనిస్తే :

నైజాం 7.02 cr
సీడెడ్ 5.34 cr
ఉత్తరాంధ్ర 2.40 cr
ఈస్ట్ 1.64 cr
వెస్ట్ 1.58 cr
గుంటూరు 2.06 cr
కృష్ణా 1.62 cr
నెల్లూరు 1.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 22.71 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా+ఓవర్సీస్ 2.48 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 25.19 cr

‘చిరుత’ చిత్రం రూ.18 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగింది.ఆ టైంలో డెబ్యూ హీరోలకు ఇంత బిజినెస్ జరగడం ఇదే మొదటిసారి.అయితే ఫుల్ రన్లో ఈ మూవీ ఏకంగా రూ.25.19 కోట్ల షేర్ ను రాబట్టింది. ఓవరాల్ గా బయ్యర్స్ కు ఈ మూవీ రూ.7.19 కోట్ల లాభాలను అందించి బ్లాక్ బస్టర్ గా నిలిచింది.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus