కోలీవుడ్ టాలెంటెట్ సీనియర్ హీరో చియాన్ విక్రమ్ మొదటిసారి తన కొడుకు ధృవ్ తో కలిసి నటించిన చిత్రం ‘మహాన్’. తమిళ జనాలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న చిత్రాలలో ఇది కూడా ఒకటి. అయితే ఈ చిత్రం థియేట్రికల్ విడుదలను కాదని నేరుగా OTT ప్లాట్‌ఫారమ్ లో విడుదల అవుతుండడం ఆశ్చర్యకరం. అమెజాన్ ప్రైమ్ వీడియోలో 2022 ఫిబ్రవరి 10న విడుదల కానున్నట్లు అఫీషియల్ గా క్లారిటీ ఇచ్చారు. కోవిడ్-19 కారణంగా చాలా సినిమాలు వాయిదా పడుతున్న విషయం తెలిసిందే.
ఇక ఇప్పట్లో అయితే తమిళనాడులో థియేట్రికల్ బిజినెస్ మళ్ళీ ఫామ్ లోకి వచ్చే అవకాశం లేదని అనుకున్నారో ఏమో గాని సినిమాలను డైరెక్ట్ గా ఓటీటీ సంస్థలకు అమ్మేస్తున్నారు. ఇక మహాన్ సినిమా కూడా ఇప్పటికే రెండు మూడు సారి వాయిదా పడింది. ఇక థియేట్రికల్ రిలీజ్ సాధ్యం కాదని గ్రహించిన తర్వాత డైరెక్ట్ గా ఓటీటీ లో విడుదల చేసేందుకు రెడీ అయ్యారు. కేవలం తమిళం లోనే కాకుండా తమిళ్ మలయాళం కన్నడ లో కూడా అమెజాన్ ప్రైమ్ లోనే విడుదల చేస్తున్నారు.
ఫిబ్రవరి 10న విడుదల చేయనున్నట్లు దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ అధికారికంగా సోషల్ మీడియాలో పోస్ట్ కూడా చేశాడు. ఇక మహా పురుష పేరుతో మలయాళం, తెలుగు, కన్నడ భాషల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఇక లలిత్ కుమార్ నిర్మించిన మహాన్ సినిమా ఒక సాధారణ వ్యక్తి యొక్క మొత్తం జీవితాన్ని అలాగే అతని చుట్టూ ఉన్న ప్రజలందరినీ మార్చే సంఘటనల యొక్క కథనం అని తెలుస్తోంది. బాబీ సింహా, సిమ్రాన్ కీలకమైన పాత్రలలో కనిపించనున్నారు.
విక్రమ్ తన కొడుకు ధృవ్ తో కలిసి నటించిన మొదటి సినిమా కాబట్టి ప్రేక్షకులు అభిమానులు థియేటర్ లోనే ఈ సినిమాను చూడాలని అనుకున్నారు. సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కామెంట్స్ అయితే గట్టిగానే చేస్తున్నారు. కానీ ప్రస్తుత పరిస్థితులలో ఓటీటీలో విడుదల చేయక తప్పడం లేదట. మరి ఓటీటీలో తండ్రి కొడుకులు ఏ స్థాయిలో హిట్ అందుకుంటారో చూడాలి.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!