PS1: పొన్నియన్ సెల్వన్ కోసం ఎవరు ఎంత తీసుకున్నారో తెలుసా?

మణిరత్నం దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం పొన్నియన్ సెల్వన్. పొన్నియన్ సెల్వన్ నవల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇకపోతే ఈ సినిమాలో స్టార్ సెలబ్రిటీలు నటించిన విషయం మనకు తెలిసిందే.అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కోసం ఎవరు ఎంత రెమ్యూనరేషన్ తీసుకున్నారనే విషయం గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.

ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోలుగా నటించినటువంటి చియాన్ విక్రమ్ ఏకంగా 12 కోట్ల రూపాయల రేషన్ తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే జయం రవి 8 కోట్లు, కార్తీ ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు సమాచారం. ఇక ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో మాజీ ప్రపంచ సుందరి ఐశ్వర్యరాయ్ కీలక పాత్రలో నటించారు. అదేవిధంగా త్రిష కూడా ఈ సినిమాలో నటించారు.

ఈ సినిమాలో ఐశ్వర్య రాయ్ నటించినందుకుగాను ఈమె పది కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నారు. అదేవిధంగా త్రిష ఐదు కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది.ప్రస్తుతం నటీనటుల పారితోషాకానికి సంబంధించిన ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజముందో తెలియదు.

ఇకపోతే మణిరత్నం డ్రీం ప్రాజెక్టుగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఊహించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయిందని చెప్పాలి. ప్రస్తుతం మిక్స్డ్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా కలెక్షన్ల పరంగా ఎలాంటి కలెక్షన్లను రాబడుతుందో తెలియాల్సి ఉంది. ఇక ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్లు మణిరత్నం ప్రకటించారు.

కృష్ణ వృంద విహారి సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అల్లూరి సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఇనయ సుల్తానా గురించి ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్6’ కంటెస్టెంట్ అభినయ శ్రీ గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus