మెగాస్టార్ చిరంజీవి హీరోగా సౌందర్య, అంజలా జావేరి లు హీరోయిన్లుగా గుణ శేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చూడాలని ఉంది’.1998 వ సంవత్సరం ఆగష్టు 27న విడుదలైంది ఈ మూవీ. అంటే నేటితో ఈ చిత్రం విడుదలై 23ఏళ్ళు పూర్తికావస్తోందన్న మాట. కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ‘వైజయంతి మూవీస్’ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మించారు.రాంగోపాల్ వర్మ… చిరుతో ‘వినాలనివుంది’ అనే చిత్రాన్ని మొదలుపెట్టి.. సగం షూటింగ్ పూర్తి చేసి మధ్యలో వదిలి వెళ్ళిపోయాడు. టబు, ఊర్మిళ ఆ చిత్రంలో హీరోయిన్లు..! అయితే ఆ చిత్రం ఆగిపోవడంతో చిరు…తన మాస్ ఇమేజ్ ను పక్కన పెట్టి ఓ ఇంటెన్షనల్ డ్రామా చెయ్యాలి అనుకున్నారు. ఆ టైంలో ‘సొగసు చూడ తరమా’ ‘బాల రామాయణం’ వంటి చిత్రాలను తెరకెక్కించిన దర్శకుడు గుణ శేఖర్ … ‘చూడాలని ఉంది’ కథను చెప్పడం కొన్ని మార్పులతో చిరు ఓకే చేయడం జరిగింది. ఇక సినిమా విడుదలయ్యాక సూపర్ హిట్ టాక్ తో రికార్డ్ కలెక్షన్లను రాబట్టింది.
ఫుల్ రన్ ముగిసేసరికి ఈ చిత్రం ఎంత కలెక్ట్ చేసిందో ఓ లుక్కేద్దాం రండి :
నైజాం
3.75 cr
సీడెడ్
2.90 cr
ఆంధ్రా(టోటల్)
5.50 cr
ఏపి+తెలంగాణ (టోటల్)
12.15 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా
0.80 cr
వరల్డ్ వైడ్ టోటల్
12.95 cr
‘చూడాలని ఉంది’ చిత్రానికి రూ.8.7 కోట్ల వరకు థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఫుల్ రన్ ముగిసేసరికి రూ.12.95 కోట్ల షేర్ ను రాబట్టింది. అంటే బయ్యర్లకు రూ.4.25 కోట్ల వరకు లాభాలు దక్కాయన్న మాట.