జానీ మాస్టర్ (Jani Master) పై నార్సింగ్ పోలీస్ స్టేషన్లో లైంగిక దాడి కేసు రిజిస్టర్ అయిన సంగతి తెలిసిందే. తర్వాత పోక్సో చట్టరీత్యా అతన్ని అరెస్ట్ చేశారు పోలీసులు. రెండు, మూడు వారాలుగా జానీ మాస్టర్ జైల్లోనే ఉన్నాడు. మధ్యలో నేషనల్ అందుకోవడం కోసం అతను బెయిల్ కి అప్లై చేసుకోగా.. అది రిజెక్ట్ అయ్యింది. బాధితురాలిని భయపెట్టి.. సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని పోలీసులు అభ్యంతరం తెలుపడంతో.. అతని బెయిల్ పిటిషన్ క్యాన్సిల్ అయ్యింది.
Jani Master
ఆ తర్వాత జానీ మాస్టర్ నేషనల్ అవార్డు సైతం క్యాన్సిల్ అవ్వడం జరిగింది. ‘వీటన్నిటినీ బట్టి జానీ మాస్టర్ ఇక బయటకు రావడం కష్టమే.. ఆయనకు బెయిల్ దొరకదు అని అంతా’ భావించారు. అయితే ఊహించని విధంగా ఈరోజు జానీ మాస్టర్ కి బెయిల్ మంజూరు అయ్యింది. అవును నిజమే..! జానీ మాస్టర్ కి బెయిల్ వచ్చింది. దీంతో ఈ కేసు కొత్త పుంతలు తొక్కనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయం పై జానీ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
తన వద్ద పనిచేసే లేడీ కొరియోగ్రాఫర్ పై జానీ మాస్టర్ లైంగిక దాడి చేసినట్లు కేసు రిజిస్టర్ అయ్యింది. బాధితురాలు మైనర్ కావడంతో ఈ కేసు కాంప్లికేటెడ్ అయినట్టు స్పష్టమవుతుంది. అయితే జానీ స్నేహితులు మాత్రం… ‘జానీ అలాంటి వ్యక్తి కాదు’ అంటూ వెనకేసుకొచ్చారు. యాని మాస్టర్, ఆట సందీప్ వంటి వారు ఈ లిస్ట్ లో ఉన్నారు. ఏదేమైనా రంగారెడ్డి కోర్టు జానీకి జైలు మంజూరు చేయడంతో.. కొందరు నెటిజెన్లు సంతోషిస్తూ కామెంట్లు పెడుతున్నారు.