Pushpa 2: బన్నీ, సుకుమార్.. వాళ్లకు కావాల్సింది వచ్చే వరకు కష్టపడుతూనే ఉంటారు!

అల్లు అర్జున్(Allu Arjun) , సుకుమార్ (Sukumar) కాంబినేషన్లో రూపొందిన ‘పుష్ప 2’  (Pushpa 2) విడుదలకు రెడీ అవుతుంది. రెండు రోజుల క్రితం ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దానికి అన్ని భాషల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. యూట్యూబ్లో ఈ ట్రైలర్ 60 మిలియన్లకు పైగా వ్యూస్ ని కొల్లగొట్టింది. ఇప్పటికీ నెంబర్ 1 ప్లేస్లో ట్రెండ్ అవుతుంది. ఇక ‘పుష్ప 2’ లో జాతర ఎపిసోడ్ హైలెట్ గా నిలుస్తుంది అంటూ టీం మొదటి నుండి చెబుతూనే ఉంది.

Pushpa 2

ముఖ్యంగా ఫైట్ సీన్ కి థియేటర్స్ షేక్ అవుతాయని గొప్పగా చెబుతున్నారు. జాతర ఎపిసోడ్ ని ఏకంగా 2000 మంది జూనియర్ ఆర్టిస్టులతో చాలా గ్రాండ్ గా చిత్రీకరించారట. ఆ విషయాన్ని కొరియోగ్రాఫర్ పోలాకి విజయ్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాకి నిర్మాతలు ‘మైత్రి మూవీ మేకర్స్’ వారు ఎక్కడా తగ్గకుండా ఖర్చు పెట్టారు అని ఆయన తెలిపాడు. పోలాకి విజయ్ మాట్లాడుతూ.. ” ‘పుష్ప 2’ లో జాతర సాంగ్ కి నేను కొరియోగ్రఫీ చేశాను.

అక్కడ ‘ఇది అవసరం’ అని నిర్మాతలకి చెప్తే చాలు వెంటనే దాన్ని ఏర్పాటు చేసేవారు. ‘పుష్ప పుష్ప’ సాంగ్ కోసం 300 మంది డాన్సర్లు అవసరం పడింది. ఒక్కోసారి 400 మంది డాన్సర్లు అవసరం పడేది. తర్వాత జాతర ఎపిసోడ్ కోసం 2000 మంది జూనియర్ల కావాల్సి వచ్చింది. అవును ఆ ఎపిసోడ్లో 2000 మంది నటించారు. అందులో 200 మంది డాన్సర్లు ఉన్నారు. సెట్లో 2000 మంది ఉండటం వల్ల ఊపిరి కూడా ఆడేది కాదు.

అయితే ఫైనల్ గా అందరికీ హ్యాపినెస్ ఇచ్చేది ఔట్పుట్. అది బాగా వస్తే చాలు. అల్లు అర్జున్ గారు చివరి నిమిషం వరకు చాలా హార్డ్ వర్క్ చేస్తారు. దర్శకులు సుకుమార్ అయితే తనకు నచ్చిన షాట్ వచ్చేవరకు చేస్తూనే ఉంటారు. ఆడియన్ కి కావాల్సింది వచ్చే వరకు అల్లు అర్జున్ కష్టపడుతూనే ఉంటారు. షాట్ చేస్తున్నప్పుడే సుకుమార్ కూడా మానిటర్ చూస్తూనే ఉంటారు. ఇంకా బెటర్ గా కావాలి అని ఆయనకు కావాల్సింది వచ్చే వరకు చేస్తూనే ఉంటారు” అంటూ చెప్పుకొచ్చాడు.

ప్రేమికుల రోజును రిజర్వ్ చేసుకున్న విరాటపర్వం దర్శకుడు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus