ఆర్ఆర్ఆర్ సినిమా సక్సెస్ తో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్ హిట్ చేరింది. వరుస విజయాలను అందుకుంటున్న తారక్ ఆర్ఆర్ఆర్ సక్సెస్ తో డబుల్ హ్యాట్రిక్ సాధించారు. ఆర్ఆర్ఆర్ మూవీకే మూడున్నరేళ్లు పరిమితమైన తారక్ ఈ సినిమాలోని కొమురం భీమ్ పాత్ర కొరకు పడిన కష్టం అంతాఇంతా కాదు. ఆర్ఆర్ఆర్ సినిమాకు సినిమాటోగ్రాఫర్ గా పని చేసిన సెంథిల్ కుమార్ ఈ సినిమా గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించారు.
రాజమౌళి ప్రేక్షకులకు మంచి కథ చెప్పాలని భావించి సినిమా తీస్తాడని బాక్సాఫీస్ రికార్డుల కంటే రాజమౌళికి మంచి కథ చెప్పడమే ముఖ్యమని సెంథిల్ అన్నారు. ఆర్ఆర్ఆర్ కథను తెరకెక్కించడం సవాల్ తో కూడిన విషయమని సెంథిల్ వెల్లడించారు. ఇద్దరు స్టార్ హీరోలను ఒకే ఫ్రేమ్ లో చూపించడం ఆర్ఆర్ఆర్ విషయంలో సవాల్ అని సెంథిల్ కుమార్ పేర్కొన్నారు. ఎన్టీఆర్ ఇంట్రడక్షన్ సీన్ షూటింగ్ కొంచెం కష్టమైందని అత్యుత్తమ వీ.ఎఫ్.ఎక్స్ డిజైనింగ్ కంపెనీ ఎంపీసీకి ఆ సీన్ కు సంబంధించిన గ్రాఫిక్స్ బాధ్యతలను అప్పగించామని సెంథిల్ అన్నారు.
జంతువును స్క్రీన్ పై చూపించడం కోసం ఎంతో కష్టపడాలని సెంథిల్ చెప్పుకొచ్చారు. పులితో ఫైట్ సీన్ లో తారక్ శ్రమను తక్కువగా అంచనా వేయలేమని సెంథిల్ వెల్లడించారు. ఎన్టీఆర్ చెప్పులు లేకుండా అడవులలో పరుగెత్తారని సెంథిల్ చెప్పుకొచ్చారు. పుణెలో ఉన్న పెద్ద పూల్ లో అండర్ వాటర్ సీన్స్ ను తెరకెక్కించామని ఇంటర్వెల్ సీన్ కోసం రాత్రిపూట 70 రోజులు షూట్ చేశామని సెంథిల్ వెల్లడించారు. రాజమౌళికి వర్క్ విషయంలో క్లారిటీ, క్రియేటివిటీ ఉంటుందని ఆయన టైమ్ వేస్ట్ కానివ్వరని సెంథిల్ చెప్పుకొచ్చారు.
ఆర్ఆర్ఆర్ కొరకు ఆర్.ఈ.ఎల్.ఎఫ్ కెమెరాను వాడామని సెంథిల్ వెల్లడించారు. మహేష్ రాజమౌళి కాంబో మూవీకి తాను పని చేస్తానో లేదో రాజమౌళినే అడగాలని సెంథిల్ అన్నారు.
Most Recommended Video
‘బాహుబలి’ కి ఉన్న ఈ 10 అడ్వాంటేజ్ లు ‘ఆర్.ఆర్.ఆర్’ కు లేవట..!
‘ఆర్.ఆర్.ఆర్’ మూవీ గురించి ఈ 11 ఇంట్రెస్టింగ్ విషయాలు మీకు తెలుసా?
‘పుష్ప’ తో పాటు బుల్లితెర పై రికార్డ్ టి.ఆర్.పి లు నమోదు చేసిన 10 సినిమాల లిస్ట్…?