వరుసగా పాన్ ఇండియా సినిమాలు వాయిదా పడుతుండటం… మరోవైపు ప్రచారం మొదలు పెట్టకపోవడంతో ‘కల్కి 2898 ఏడీ’ సినిమా రిలీజ్‌పై డౌట్స్ మొదలయ్యాయి. చిన్నగా మొదలైన ఈ పుకార్లు కాస్త పెద్దవి అవుతున్నాయి. అయితే ఇన్నాళ్లు కాస్త కామ్‌గా ఉన్న టీమ్ ఒక్కసారిగా రియాక్ట్ అయ్యింది. ఓ ఆరు సెకన్ల వీడియోను ఎక్స్ (మాజీ ట్విటర్)లో షేర్ చేసింది. ఆ వీడియోలో ఏం లేకపోయినా సినిమా అయితే మే 9న వచ్చేస్తుంది అని మరోసారి చెప్పకపోయారు.
‘సలార్’ సినిమాలో కేవలం నీడతోనే ప్రభాస్ కోసం ఎలివేషన్ సీన్ రాశారు ప్రశాంత్ నీల్. ఇప్పుడు ‘కల్కి’ విషయాన్ని కాలు ఊపుతున్న వీడియోను రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చారు నాగ్ అశ్విన్. అలా చెప్పించడంతో ఏం ఆలోచన ఉందో తెలియదు కానీ… చాలా ఆరామ్‌సే ఉన్నాం సినిమా రిలీజ్ విషయంలో అని చెప్పారు అని అనుకోవచ్చు. దీంతో ఈ సినిమా విడుదల వాయిదా పడే అవకాశాలు ఉన్నాయంటూ వచ్చిన వార్తలకు క్లారిటీ దొరికినట్లయింది.
‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ప్రభాస్‌కు జోడీగా దీపిక పడుకొణె నటిస్తుండగా… . కమల్ హాసన్) ప్రతినాయకుడిగా యాక్ట్ చేస్తున్నారు. అమితాబ్ బచ్చన్ మరో కీలక పాత్రధారి. వీళ్లు కాకుండా ఇండియన్ సినిమాలో బిగ్గెస్ట్ స్టార్లు చాలామంది ఈ సినిమాలో అతిథి పాత్రల్లో కనిపిస్తారు అని అంటున్నారు. ఆ లిస్ట్‌లో రానా, ఎన్టీఆర్, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్… ఇలా చాలామందే ఉన్నారు. అయితే వీటి విషయంలో ఎలాంటి క్లారిటీ లేదు.
తాజాగా మరో క్లారిటీ లేని అంశం ఒకటి బయటికొచ్చింది. ఆదే ఈ సినిమాను తొమ్మిది భాగాలుగా తెరకెక్కిస్తున్నారు అని. ఇప్పటివరకు ఈ విషయంలో టీమ్ ఎలాంటి ప్రకటనా చేయలేదు. కానీ నటుడు అభినవ్ గొమటం ఒక ఇంటర్వ్యూలో ఈ విషయం గురించి ప్రస్తావించారు. ‘కల్కి’ సినిమా కోసం ఎదురుచూస్తున్నాను. ఈ సినిమా తొమ్మిది పార్టులుగా రాబోతుందని విన్నాను. ఆ మాట విన్న దగ్గర నుండి సినిమాపై మరింత ఆసక్తి పెరిగింది అని అన్నారు.
దీంతో ఈ సినిమా ఎన్ని భాగాలు అనే ప్రశ్న మొదలైంది. అన్నట్లు మే 9 పక్కా అని చెబుతున్నారు కానీ… ఇంకా గట్టిగా చూస్తే రెండు నెలలే ఉంది. ఈ లోపు ఈ పాన్ ఇండియా సినిమా ప్రచారం పెద్ద ఎత్తున చేయాలి. దీంతో టైమ్ సరిపోతుందా అనే ప్రశ్న వినిపిస్తోంది.
సుందరం మాస్టర్ సినిమా రివ్యూ & రేటింగ్!
మస్తు షేడ్స్ ఉన్నయ్ రా సినిమా రివ్యూ & రేటింగ్!
సిద్ధార్ధ్ రాయ్ సినిమా రివ్యూ & రేటింగ్!