అల్లు అర్జున్ ప్రస్తుతం త్రివిక్రమ్ డైరెక్షన్లో ఓ చిత్రం చేస్తున్నాడు. 2020 సంక్రాంతి కానుకగా ఈ చిత్రం విడుదల కాబోతుంది. ‘గీత ఆర్ట్స్’ మరియు ‘హారిక అండ్ హాసిని’ క్రియేషన్స్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రం తర్వాత ‘ఎం.సి.ఎ’ ఫేమ్ వేణు శ్రీరామ్ డైరెక్షన్లో ‘ఐకాన్’ అనే చిత్రం చేయబోతున్నాడు. దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాత. అయితే ఈ చిత్రానికి బన్నీ రెమ్యూనరేషన్ భారీగా డిమాండ్ చేశాడట. దాంతో అంత కష్టం అని దిల్ రాజు చెబితే.. డిజిటల్ రైట్స్ లో షేర్ అడిగాడట.
‘ఓ పక్క సినిమాకి.. చాలా తెగించి బడ్జెట్ పెడుతున్నాం. ఇప్పుడున్న మార్కెట్ కి తగ్గట్టుగా సినిమా చేయాలంటే నిర్మాతకి చాలా గట్స్ ఉండాలి. ఇలాంటి టైములో థియేట్రికల్ రైట్స్ నుండీ నిర్మాతకి వచ్చేది కేవలం 25 శాతం లాభాలే. ఒక వేళ సినిమా ప్లాపయితే.. మా తరువాత సినిమాకి రేట్లు తగ్గించమని డిస్ట్రిబ్యూటర్లు అడుగుతారు. ఇలాంటి సమయంలో నీ మార్కెట్ కు మించి రెమ్యూనరేషన్ అడగడం కరెక్ట్ కాదంటూ దిల్ రాజు వివరణ ఇచ్చారంట . అయినప్పటికీ అల్లు అర్జున్ మాత్రం ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నాడని సమాచారం.