Sai Dharam Tej: కోట్లు కొట్టేసిన వ్యక్తిని వదిలేసి.. తేజుని టార్గెట్ చేస్తున్నారా?

మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్..కు ఇండస్ట్రీలో చాలా మంచి పేరు ఉంది. అతను అందరితోనూ స్నేహంగా ఉంటాడు. ఇంకో వ్యక్తిని ఓ మాట అని హర్ట్ చేయడం అతనికి రాదు. సాయి ధరమ్ తేజ్ చేసిన సోషల్ సర్వీసులు చాలా ఉన్నాయి. ఎంతో మందికి అతను ఆర్ధిక సాయం చేశాడు. ఎంతో మందికి అతను అన్నం పెట్టాడు. నమ్మిన వాళ్ళను మోసం చేసే రకం అస్సలు కాదు. అలాంటి సాయి ధరమ్ తేజ్ గురించి ఇప్పుడు నెగిటివ్ ప్రచారం జరుగుతుంది.

అసలు విషయంలోకి వెళితే.. ‘సాయి ధరమ్ తేజ్ (Sai Dharam Tej) కు అతని మేనేజర్ కు మధ్య మాటల యుద్ధం జరిగిందని, దీంతో అతని మేనేజర్ ఉద్యోగం మానేసి వెళ్లిపోయాడని, అందువల్ల తన తల్లి సూచన మేరకు తన సామజిక వర్గానికి చెందిన ఓ వ్యక్తిని మేనేజర్ గా పెట్టుకున్నట్టు ప్రచారం జరుగుతుంది. ఇది ప్రచారం మాత్రమే.. అయితే అసలు విషయం వేరే ఉందని టాక్. ఇప్పుడు ఎవరితో(మేనేజర్) అయితే సాయి ధరమ్ తేజ్ గొడవ పెట్టుకున్నాడని అంటున్నారో..

అతన్ని ఎంతో గానో నమ్మాడట మన మెగా మేనల్లుడు. అందుకోసం తన ‘విరూపాక్ష’ ఉత్తరాంధ్ర రైట్స్ కూడా అతనికే ఇప్పించాడు.అది కూడా అడ్వాన్స్ లు వంటివి లేకుండా లాభాల్లో వాటా ఇచ్చేలాగా.. కేవలం సాయి ధరమ్ తేజ్ మాటను ఆధారం చేసుకునే నిర్మాత అతనికి ఉత్తరాంధ్ర రైట్స్ ఇవ్వడం జరిగిందట.! సినిమా అక్కడ బాగా ఆడింది. రూ.7 కోట్ల పైనే వసూళ్లు రాబట్టింది. కానీ ఖర్చులు పోగా అక్కడ మిగిలింది ఏమీ లేదు అని నిర్మాతలకు అతను ఏమీ చెల్లించింది లేదట.

దీంతో ఇద్దరి మధ్య ఎక్కువ చర్చలు నడిచాయి. ఈ క్రమంలో తన లైఫ్ ఎలాగు సెట్ అయిపోయినట్టే కాబట్టి.. ఉద్యోగం మానేసి వెళ్ళిపోయాడు సాయి ధరమ్ తేజ్ మేనేజర్.అయితే ఈ విషయాన్ని బయటకు రానివ్వకుండా.. ఆ మేనేజర్ వేరే విధంగా ప్రచారం చేయిస్తున్నాడు. సాయి ధరమ్ తేజ్ వివాదాలకు చాలా దూరంగా ఉండడానికి ఇష్టపడతాడు. ఇప్పుడు కూడా అదే చేస్తున్నాడు అని తెలుస్తుంది. అందుకే ఇలాంటి బేస్ లెస్ వార్తలను పట్టుకుని అతని పై నెగిటివిటీ స్ప్రెడ్ చేస్తున్నట్టు స్పష్టమవుతుంది.

మేమ్ ఫేమస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సత్తిగాని రెండెకరాలు సినిమా రివ్యూ & రేటింగ్!

మళ్ళీ పెళ్లి సినిమా రివ్యూ & రేటింగ్!
‘డాడీ’ తో పాటు చిరు – శరత్ కుమార్ కలిసి నటించిన సినిమాల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus