Tollywood Drugs Case: టాలీవుడ్ డ్రగ్స్ కేసు.. అందరూ మంచోళ్లే!

విచారణను ఎదుర్కొన్న సినీ ప్రముఖుల్లో ఎవరికి కూడా డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదని క్లీన్ చిట్ ఇచ్చేశారు. 2017లో టాలీవుడ్ ఇండస్ట్రీపై డ్రగ్స్ మరకలు ఏ రేంజ్ లో అంటుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిజం, అబద్ధం ఏమిటనేది తెలియకముందే ఓ వర్గం మీడియా సగం బురద చల్లెసింది. ఇక నాలుగేళ్ళ అనంతరం అందరూ మంచోళ్లే అని తీర్పు రావడం వైరల్ గా మారింది. తెలంగాణ పోలీసులు విచారణకు సంబంధించిన నిజాన్ని కోర్టుకు తెలుపగా ఆ చార్జిషీట్‌ను న్యాయస్థానం ఆమోదించింది.

డ్రగ్స్ వాడుతున్నారన్న అనుమానంతో విచారించి 11 మంది సినీ ప్రముఖులకు క్లీన్‌చిట్ ఇచ్చారు. ఒక స్టార్ హీరో సోదరుడి యాక్సిడెంట్ అనంతరం ఫోన్ కాల్స్ ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీలో డ్రగ్స్ వ్యవహారం నడుస్తున్నట్లు టాక్ అయితే వచ్చింది. ఇక ఫోన్ ద్వారా దొరికిన వివరాలో లేక మరొకరు రివీల్ చేశారో తెలియదు గాని 2017 జులై 2న ఒకేసారి 12 డ్రగ్స్‌ కేసులు నమోదు చేసి 30 మందిని అరెస్ట్‌ చేశారు. అందులో 27 మందిని ప్రశ్నించారు.

ఇక అప్పుడు 8 కేసుల్లో మాత్రమే చార్జిషీట్ ఫైల్ చేయగా పోలీసులపై విమర్శలు వచ్చాయి. దీంతో మరో 4 చార్జిషీట్లు దాఖలు చేసి షాక్ ఇచ్చారు. ప్రముఖ సినీ తారలను పిలిచి గోళ్లు, వెంట్రుకలు సేకరించారు. గంటల తరబడి విచారణలు జరిపిన విషయం తెలిసిందే. మొత్తానికి నాలుగేళ్ళ అనంతరం ఆ ప్రముఖుల్లో ఎవరికి కూడా డ్రగ్స్ తో ఎలాంటి సంబంధం లేదని క్లీన్‌చిట్ ఇచ్చేశారు. ఇక ఇన్వెస్టిగేషన్ సరిగ్గా చేయడం లేదని అప్పట్లో ప్రతిపక్ష నాయకుల నుంచి గట్టిగానే విమర్శలు వచ్చాయి. ఇక ప్రభుత్వ అధికారులు సరిగ్గా విచారణ జరపడం లేదని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి న్యాయ పోరాటానికి దిగడం హాట్ టాపిక్ గా మారింది.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus