ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి తెలుగు సినిమా పరిశ్రమని టార్గెట్ చేసి ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇప్పటికే టికెట్ రేట్లను తగ్గించేసి పెద్ద సినిమాలు రిలీజ్ కాకుండా చేశారు. విడుదలైన పెద్ద సినిమాలు కూడా ఆంధ్రలో బ్రేక్ ఈవెన్ కాని పరిస్థితి.ఈ ఇష్యుకి ఫుల్ స్టాప్ పెట్టాలని చిరంజీవి,ప్రభాస్, మహేష్ బాబు.. వంటి స్టార్ హీరోలు ఈరోజు ఏపి ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డితో సమావేశమై పరిస్థితిని వివరించారు. ఈ క్రమంలో జగన్ సానుకూలంగా స్పందించారు.. కానీ కొన్ని షరతులు కూడా పెట్టారు.
ఇప్పటి వరకు తగ్గించిన టికెట్ ధరలను పెంచడమే కాకుండా పెద్ద సినిమాలకు టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటుని కల్పిస్తామని ఆయన హామీ ఇచ్చారు. “రెమ్యూనరేషన్ల పరంగా కాకుండా రూ.100 కోట్లు పైగా పెట్టుబడితో నిర్మించే భారీ చిత్రాలు …మన రాజమౌళి అన్న అలాంటి వాటికి పేరొందారు కదా…. అలాంటి చిత్రాలకు అధిక టికెట్ రేటు అమ్మే విధంగా నిర్ణయం తీసుకుంటాము…. ఇదే క్రమంలో అన్ని సినిమాలకు అనుకూలంగా ఉండే టికెట్ రేట్లు కూడా ఉండేలా తగిన నిర్ణయం తీసుకుంటాము.చిరంజీవి అన్నతో అనేక సార్లు మాట్లాడి ఇప్పుడు ఈ సమస్యల్ని ఓ కొలిక్కి తెచ్చాం.
అయితే మీరంతా వైజాగ్ కు షిఫ్ట్ అవ్వండి. తెలంగాణ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ నుంచే తెలుగు సినిమాకి ఎక్కువ ఆదాయం వస్తోంది. తెలంగాణ నుంచి 35 శాతం ఆదాయం అయితే ఏపీ నుండీ 60 శాతం వస్తుంది. మన దగ్గర థియేటర్లు కూడా ఎక్కువ ఎక్కువ రెవెన్యూ ఉంటుంది. విశాఖపట్నంలో కూడా హైదరాబాద్ స్థాయిలో సినిమా పరిశ్రమని అభివృద్ధి చేద్దాం.కావాలంటే ఇక్కడ స్థలాలు ఇస్తాం. స్టూడియోలు కట్టాలనుకునే వాళ్ళు ముందు రావచ్చు. ఇక్కడ కూడా జూబిలీహిల్స్ వంటి బిగ్ హబ్ ఏరియాని డెవలప్ చేద్దాం” అని జగన్ చెప్పుకొచ్చారు.
జగన్ ప్రతిపాదన ఓ విధంగా టాలీవుడ్ పెద్దల్ని ఇరకాటంలో పెట్టిందనే చెప్పాలి. నిజానికి షూటింగ్ చేయడానికి అయితే సినిమా వాళ్ళు ఆంధ్ర వైపుకి రావడం లేదు. వచ్చినా వైజాగ్ వరకు మాత్రమే. చిన్న సినిమాలు అయితే అమలాపురం, రాజమండ్రి వంటి ఏరియాలకు వస్తున్నాయి. అదే పెద్ద సినిమాలకి పల్లెటూరి వాతావరణం కావాలంటే కేరళ వెళ్లిపోతున్నారు. ఏపిలో కూడా కొంత భాగం షూటింగ్ చేయాలని కూడా జగన్ డిమాండ్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.
Most Recommended Video
బ్రహ్మానందం కామెడీతో హిట్టైన 10 సినిమాల లిస్ట్..!
తమిళంలో సత్తా చాటిన తెలుగు సినిమాలు … టాప్ 10 లిస్ట్ ఇదే ..!
అంతా ఓకే అయ్యి ఆగిపోయిన చిరంజీవి సినిమాలివే!