చియాన్ విక్రమ్ హీరోగా ‘డిమోటీ కాలనీ’ ‘అంజలి సి.బి.ఐ’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన దర్శకుడు ఆర్.అజయ్ జ్ఞానముత్తు తెరకెక్కించిన చిత్రం ‘కోబ్రా’. ఇది అతనికి మూడో చిత్రం కావడం విశేషం. యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్టు 31న ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘సెవెన్ స్క్రీన్ స్టూడియోస్’ బ్యానర్ పై ఎస్.ఎస్.లలిత్ కుమార్ నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో ఎన్వీ ప్రసాద్ ‘ఎన్వీఆర్ సినిమా’ ద్వారా విడుదల చేస్తున్నారు.
‘కె.జి.ఎఫ్'(సిరీస్) హీరోయిన్ శ్రీనిధి శెట్టి ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించడం.. ఆస్కార్ అవార్డు గ్రహీత ఏ.ఆర్.రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందించడంతో సినిమాకి మంచి బజ్ ఏర్పడింది. టీజర్, ట్రైలర్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండటంతో ఈ వారం ప్రేక్షకులకు ఫస్ట్ ఛాయిస్ గా మారిపోయింది ‘కోబ్రా’. తాజాగా ఈ చిత్రానికి ఫస్ట్ రివ్యూ కూడా వచ్చేసింది.ప్రముఖ ఓవర్సీస్ సెన్సార్ సభ్యుడు అయిన ఉమైర్ సంధు ‘కోబ్రా’ చిత్రాన్ని వీక్షించి.. తన అభిప్రాయాన్ని ట్విట్టర్ మరియు ఇన్స్టాగ్రామ్లో ద్వారా వెల్లడించాడు.
‘ ‘కోబ్రా’ చిత్రం యూనిక్ కాన్సెప్ట్ తో తెరకెక్కింది.
డైరెక్షన్ కూడా చాలా టెరిఫిక్ గా ఉందని అతను పేర్కొన్నాడు.
క్లైమాక్స్, ప్రొడక్షన్ డిజైన్ అత్యద్భుతంగా ఉన్నాయని అతను పేర్కొన్నాడు.
హీరో విక్రమ్ మరోసారి అవార్డు విన్నింగ్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడట. తన నటనతో సినిమాకే హైలెట్ గా నిలిచాడట.
క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కూడా ఈ చిత్రంలో నటించిన సంగతి తెలిసిందే. అతని నటన కూడా సూపర్ గా ఉందట.
ఎన్నో ట్విస్ట్ లతో ఈ మూవీని దర్శకుడు అత్యద్భుతంగా మలిచాడని ఉమైర్ తెలిపాడు.
కానీ చివర్లో మాత్రం మల్టీ ప్లెక్స్ ఆడియన్స్ ఈ మూవీని కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు అని తెలిపాడు.
చివర్లో ‘కోబ్రా’ చిత్రానికి 3.5/5 రేటింగ్ ఇస్తున్నట్టు కూడా తెలిపాడు ఉమైర్ సంధు.
మరి సింగిల్ స్క్రీన్ ఆడియెన్స్ ను ఈ మూవీ ఏ స్థాయిలో అలరిస్తుంది అన్నది తెలియాల్సి ఉంది. మరోపక్క ఉమైర్ సంధు గతంలో చాలా సినిమాలకు ఇలాగె పాజిటివ్ రివ్యూలు ఇచ్చాడు. అందులో చాలా సినిమాలు డిజాస్టర్లు అయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇతని రివ్యూలు ఎక్కువమంది ప్రేక్షకులు పట్టించుకోరు కానీ అభిమానులకు మాత్రం క్యూరియాసిటీ పెంచే విధంగా ఉంటాయి.