టాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సమంత, రష్మికలకు ప్రేక్షకుల్లో ఊహించని స్థాయిలో పాపులారిటీ ఉంది. ఈ ఇద్దరు స్టార్ హీరోయిన్ల రెమ్యునరేషన్లు దాదాపుగా సమానం కావడం గమనార్హం. ప్రాజెక్ట్, హీరో, డైరెక్టర్ ను బట్టి ఈ హీరోయిన్లు ఒక్కో సినిమాకు 3 నుంచి 4 కోట్ల రూపాయల రేంజ్ లో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. అయితే ఓర్ మ్యాక్స్ సర్వేలో మాత్రం గత కొన్ని నెలలుగా సమంత నంబర్ వన్ స్థానంలో నిలుస్తున్నారు.
ఫ్యామిలీ మేన్2 వెబ్ సిరీస్ ద్వారా సమంతకు కూడా బాలీవుడ్ లో క్రేజ్ పెరిగింది. బాలీవుడ్ నుంచి సమంతకు ఆఫర్లు వస్తున్నా ఆ ఆఫర్ల విషయంలో సమంత ఆచితూచి వ్యవహరిస్తున్నారు. అయితే సమంత బాలీవుడ్ ఆఫర్ల విషయంలో ఈ విధంగా చేయడానికి రష్మిక కారణమని ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తుండటం గమనార్హం. పుష్ప ది రైజ్ సినిమాతో రష్మిక బాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరయ్యారు. ప్రస్తుతం పలు బాలీవుడ్ ప్రాజెక్ట్ లతో రష్మిక బిజీగా ఉన్నారు.
గుడ్ బై, మిషన్ మజ్ను, యానిమల్ సినిమాలతో రష్మిక పాపులారిటీ మరింత పెరగడం గ్యారంటీ అని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే రష్మిక దూకుడుకు సమంత బ్రేకులు వేయాలని భావిస్తున్నారని సమాచారం. సమంత ఒకే సమయంలో మూడు బాలీవుడ్ ప్రాజెక్ట్ లను ప్రకటించనున్నారని సమాచారం అందుతోంది. ఈ విధంగా చేయడం ద్వారా రష్మికకు షాకివ్వాలని సమంత భావిస్తున్నారని బోగట్టా.
రష్మిక సమంత మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రాబోయే రోజుల్లో బాలీవుడ్ ఇండస్ట్రీలో సైతం ఈ ఇద్దరు హీరోయిన్ల మధ్య పోటీ తీవ్రస్థాయిలో ఉండనుందని బోగట్టా. అయితే ఈ ఇద్దరు హీరోయిన్ల అభిమానులు మాత్రం ఈ ఇద్దరు హీరోయిన్లు బాలీవుడ్ లో సక్సెస్ కావాలని కోరుకుంటున్నారు. వయస్సు పెరుగుతున్నా ఈ ఇద్దరు హీరోయిన్లకు క్రేజ్ ఏ మాత్రం తగ్గడం లేదు.