Vishwak Sen, SKN: ‘బేబీ’ సినిమా నాటి రచ్చే… ఇప్పటికి ‘కల్ట్‌’ చర్చకు కారణమా?

సినిమా పేరు వివాదాలు టాలీవుడ్‌కి కొత్తేం కాదు. గతంలో చాలాసార్లు సినిమాల టైటిల్స్‌ విషయంలో పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి. ఆ తర్వాత ఏదో రకంగా ఇష్యూను తేల్చుకున్నారు. పేరు ఇంత పెద్ద తకరారు తీసుకొచ్చినా… సినిమా జనాలు మాత్రం తగ్గడం లేదు. ఎప్పుడూ ఏదో ఒక సినిమా విషయంలో ఇష్యూ వస్తూనే ఉంది. కొన్ని ఇష్యూలు బయటి నుండి వస్తే… ఇంకొన్ని ఇద్దరూ ఒకే పేరు లేదంటే ఒకే లాంటి పేరు పెడుతున్నారు. దీంతో పెద్ద ఎత్తున పంచాయతీ అవుతోంది.

తాజాగా ఇలానే టాలీవుడ్‌లో టైటిల్‌ పంచాయితీ మొదలైంది. ఈసారి ఆ టైటిల్‌ పేరు ‘కల్ట్‌’. ఈ పేరు వినగానే మనకు ఠక్కున గుర్తొచ్చేది ‘బేబీ’ సినిమా. ఈ సినిమా ప్రచారంలోనే ఆ పేరు ఎక్కువగా విన్నాం. అయితే తాజా పంచాయితీలో ఈ సినిమాకు కూడా లింక్‌ ఉంది అంటున్నారు. ‘బేబీ’ సినిమా విజయం తర్వాత నిర్మాత ఎస్‌కేఎన్‌ మాట్లాడుతూ ‘కల్ట్‌ బొమ్మ’తో హిట్‌ కొట్టాం అని పదే పదే అన్నారు. ఆ తర్వాత ఆ పేరును ఆయన ఓ టైటిల్‌గా రిజిస్టర్‌ చేయించారు కూడా.

ఇప్పుడు అందులో మొదటి ముక్క ‘కల్ట్‌’కు ఓ హ్యాష్‌ట్యాగ్‌ను జోడించి సినిమాగా అనౌన్స్‌ చేశాడు ఇటీవల నిర్మాతగా మారిన దర్శకుడు కమ్‌ హీరో విశ్వక్‌సేన్‌. కొత్తగా నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసి, కొత్త కుర్రాళ్లతో ఆ సినిమాను అనౌన్స్‌ చేశాడాయన. అయితే మరి ముందే ‘కల్ట్‌ బొమ్మ’ టైటిల్‌ను ఛాంబర్‌లో రిజిస్టర్‌ చేయించుకున్న ఎస్‌కేఎన్‌ మాత్రమే ఆ టైటిల్ మీద సర్వహక్కులు తనవే అంటున్నారు. దీంతో ఎస్‌కేఎన్‌, విశ్వక్‌సేన్‌ మధ్యలో ఏం జరుగుతోంది / జరిగింది / జరగబోతోంది అనే చర్చ మొదలైంది.

ఇదే సమయంలో ‘బేబీ’ సినిమా సమయంలో జరిగిన మరో చర్చ కూడా ప్రస్తావనకు వస్తోంది. ఆ సినిమాలో ఓ పాత్రను ఆఫర్‌ చేస్తే విశ్వక్‌సేన్‌ నో చెప్పారు అనేది అప్పటి డిస్కషన్‌ పాయింట్‌. ఆ తర్వాత ఏవేవో మాటలు ఎక్స్‌ఛేంజ్‌ అయినా… ఇప్పుడు ‘కల్ట్‌’ టైటిల్‌ డిస్కషన్‌కి వచ్చింది. దీంతో ‘బేబీ’కి, ‘కల్ట్‌’కి ఏమైనా సంబంధం ఉందా అని సోషల్‌ మీడియాలో చర్చ జరుగుతోంది.

ఈ ఏడాది ప్రేక్షకుల్ని ఆకట్టుకున్న తెలుగు సినిమాలు!

ఈ ఏడాది వచ్చిన 10 రీమేక్ సినిమాలు… ఎన్ని హిట్టు.. ఎన్ని ఫ్లాప్?
ఈ ఏడాది ప్రేక్షకులు తలపట్టుకొనేలా చేసిన తెలుగు సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus