సినీ ఇండస్ట్రీ గ్రూప్ లు గా విడిపోయిందని… ఇటీవల బాలయ్య చేసిన కామెంట్స్ పెద్ద ధూమారాన్నే రేపాయి. ఇండస్ట్రీ బాగుకోసం జరిపిన మీటింగ్ లకు తనను పిలవలేదు అంటూ బాలయ్య అసహనం వ్యక్తం చేసాడు. ఇక దాని ప్రభావం ఎంత వరకూ వెళ్ళిందో.. వెళ్తుందో.. మనం చూస్తూనే వస్తున్నాం. కొన్ని సినిమా వేడుకల్లోనూ.. అవార్డుల వేడుకల్లోనూ.. ‘మేము అత్యంత సన్నిహితులం’ అని చిరు, బాలయ్య లు చెప్పుకొచ్చినా.. వీరి మధ్య కోల్డ్ వార్ మాత్రం జరుగుతూనే ఉంది అనేది కొందరి అభిప్రాయం. అయితే టాలీవుడ్ లో ఇలాంటి గొడవలు చోటు చేసుకోవడం ఇది మొదటిసారి కాదు..
ఒకప్పటి స్టార్ హీరోలైన ఎన్టీఆర్,ఏ.ఎన్.ఆర్, కృష్ణ ల టైం నుండీ చోటు చేసుకుంటేనే ఉన్నాయని తెలుస్తుంది. ఎన్టీఆర్, ఏ.ఎన్.ఆర్ ల మధ్య మొదటి గొడవ చోటు చేసుకోవడంతో… ఇక నుండీ వీరిద్దరూ కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చెయ్యకూడదని డిసైడ్ అయ్యారట. కానీ నాగి రెడ్డి, చక్రపాణి వంటి వారు వీరి మధ్య రాజీ కుదిర్చి.. ‘గుండమ్మ కథ’ చేయించారట. అటు తరువాత కొన్నాళ్ళకు ఏ.ఎన్.ఆర్ కు చెందిన ‘అన్నపూర్ణ స్టూడియోస్’ గోడలను… ఎన్టీఆర్ రాజకీయాల్లో అధికారంలో ఉన్నప్పుడు పడకొట్టించారట. అయితే మళ్ళీ వీరిద్దరూ కలిసిపోయారట.
ఇక ‘అల్లూరి సీతారామరాజు’ సినిమా విషయంలో ఎన్టీఆర్, కృష్ణ ల మధ్య గొడవ చోటు చేసుకుందట. ఆ టైములో ఏ.ఎన్.ఆర్ ‘దేవదాస్’ చిత్రాన్ని సినిమా స్కోప్ లో రీమేక్ చేసి విడుదల చేశారట కృష్ణ. అదే టైంలో ఏ.ఎన్.ఆర్ ‘దేవదాస్’ ను కావాలనే రీ రిలీజ్.. కృష్ణ ‘దేవదాస్’ చిత్రం ప్లాప్ అవ్వడంతో కీలక పాత్ర పోషించారట ఎన్టీఆర్. తరువాత కృష్ణ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారట. ఆ టైములో తన సినిమాల్లోని కొన్ని పాత్రల ద్వారా ఎన్టీఆర్ పై సెటైర్లు కూడా వేసేవారట. ఇలా టాలీవుడ్ లో మనస్పర్థలు చోటుచేసుకోవడం ఎప్పటి నుండో ఉన్నాయని తెలుస్తుంది.