Chalaki Chanti: చంటి ఈజ్ బ్యాక్… ఆరోగ్యం కుదటపడినట్లేనా?

జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఈ కార్యక్రమం ద్వారా కమెడియన్ గా గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో చలాకి చంటి ఒకరు. ఈయన భీమిలి కబడ్డీ జట్టు సినిమా ద్వారా హాస్యనటుడిగా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఇలా పలు సినిమాలలో నటించిన ఈయన అవకాశాలు లేకపోవడంతో సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటూ జబర్దస్త్ కార్యక్రమంలో సందడి చేశారు. అయితే ఈ కార్యక్రమంలో ఎంతో మంచి గుర్తింపు పొందారు.

ఈ విధంగా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి చలాకి చంటి శ్రీదేవి డ్రామా కంపెనీ కార్యక్రమంలో కూడా సందడి చేశారు. అయితే ఈయనకు బిగ్ బాస్ అవకాశం రావడంతో ఈ కార్యక్రమాల నుంచి తప్పుకొని బిగ్ బాస్ కార్యక్రమానికి వెళ్లారు. బిగ్ బాస్ హౌస్లో కొన్నివారాల పాటు కొనసాగిన చంటి అనంతరం ఎలిమినేట్ అయ్యారు. ఇక చంటి బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఎలాంటి షోలలోను సినిమాలలో కనిపించలేదు.

ఇలా బిగ్ బాస్ కార్యక్రమం అనంతరం బుల్లితెర కార్యక్రమాలకు దూరంగా ఉన్నటువంటి చంటి ఏప్రిల్ నెలలో తీవ్రమైన అనారోగ్య సమస్యలకు గురయ్యారని వార్తలు వచ్చాయి.ఈయనకు గుండెపోటు రావడంతో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని అలాంటి సమయంలో పలువురు జబర్దస్త్ కమెడీయన్స్ అలాగే యాంకర్ అనసూయ కూడా అండగా నిలిచారు అంటూ వార్తలు వినిపించాయి.

ఇలా అనారోగ్య సమస్యలతో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నటువంటి (Chalaki Chanti) చంటి తిరిగి జబర్దస్త్ కార్యక్రమానికి వచ్చారని తాజా ప్రోమో ద్వారా తెలుస్తుంది.జబర్దస్త్ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా అందులో చంటి కనిపించడంతో ఈయన తిరిగి ఈ కార్యక్రమంలోకి వచ్చారని భావిస్తున్నారు. ఇలా చంటిని చూసినటువంటి అభిమానులు చంటి ఆరోగ్యం కుదటపడినట్లేనా అందుకే ఇలా బుల్లితెర కార్యక్రమాలకు హాజరవుతున్నారా అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus