Sri Hari: నటుడు శ్రీహరి ఇంత గొప్ప వ్యక్తా..?

  • June 7, 2021 / 09:25 AM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా అన్ని రకాల పాత్రలు పోషించి తన నటనతో మెప్పించిన నటుల్లో శ్రీహరి ఒకరు. మంచి వ్యక్తిత్వం గల నటుడైన శ్రీహరి ఎవరైనా సాయం కోసం తన దగ్గరకు వస్తే లేదని చెప్పకుండా సహాయం చేసి వార్తల్లో నిలిచారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన శ్రీహరి స్టంట్ మాస్టర్ గా కెరీర్ ను మొదలుపెట్టి ధర్మక్షేత్రం సినిమాతో నటుడిగా మారారు. రియల్ స్టార్ గా పేరును సంపాదించుకున్న శ్రీహరి తెలుగులో 100కు పైగా సినిమాలలో నటించారు.

ఒకవైపు హీరోగా మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో చేయడం శ్రీహరికి మాత్రమే చెల్లింది. పలు సినిమాల్లో హైదరాబాదీ తెలంగాణ యాసలో డైలాగులు చెప్పి శ్రీహరి మెప్పించడం గమనార్హం. 2013 సంవత్సరం అక్టోబర్ నెల 9వ తేదీన ఆరోగ్య సమస్యల వల్ల శ్రీహరి మృతిచెందారు. అయితే తాజాగా సుమ యాంకర్ గా చేస్తున్న క్యాష్ షోలో పాల్గొన్న పృథ్వీ శ్రీహరి గొప్పదనం గురించి చెప్పుకొచ్చారు.

కొన్నివేల మందికి శ్రీహరి దానాలు చేశారని పృథ్వీ తెలిపారు. కష్టాల్లో ఉన్నామంటూ ఎవరైనా తన ఇంటి ముందుకు వస్తే శ్రీహరి డబ్బుకు రాయి కట్టి ఆ రాయికి గుడ్డ చుట్టి రోడ్డుపైకి విసిరేవారని పృథ్వీరాజ్ వెల్లడించారు. శ్రీహరి అలా డబ్బులు విసిరి ఆపదలో ఉన్నవాళ్ల కష్టాలు తీర్చేవారని పృథ్వీ పేర్కొన్నారు. శ్రీహరి గురించి పృథ్వీ అలా చెప్పడంతో షోలో పాల్గొన్న మిగతా సెలబ్రిటీలు సైతం చప్పట్లు కొట్టారు.


ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus