టాలీవుడ్ ను దాదాపుగా 30ఏళ్లకు పైగా ఏలినా మెగాస్టార్…అనుకోకుండా పొలిటికల్ లైఫ్ వైపు అడుగులు వేసి…అక్కడ తిన్న ఎదురుదెబ్బల వల్ల…మళ్లీ ముఖానికి రంగు వేసుకున్నాడు….అయితే అదే క్రమంలో చిరు దాదాపుగా 9ఏళ్ల తరువాత సినిమాల్లో నటించాడు….ఖైదీ150గా చిరు మళ్లీ ఇండస్ట్రీ లో నిలదొక్కుకోవాలి అని విశ్వ ప్రయత్నాలే చేశాడు…ఏదైన మంచి కధతో సినిమా చేసి ఉంటే బావుండేది….పూర్తి కమర్షియల్, ఫక్తు తమిళ కధను తెచ్చుకుని…మక్కికి మక్కీ దించి హిట్ కొట్టాం అన్నట్లుగా సినిమాను ముగించారు….సినిమాకు కలెక్షన్స్ అయితే ఓ మోస్తరు బాగానే వచ్చాయి కానీ…సినిమా వల్ల చిరుకి ప్రత్యేకంగా ఒరిగింది ఏమీ లేదు.
ఇదిలా ఉంటే….బుల్లి తెరపైన కనిపిస్తే…మళ్ళీ అందరికీ దగ్గర అవ్వవచ్చు అన్న ఆలోచనతో….‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ కార్యక్రమంతో ముందు వచ్చినా…ఆ షో ప్యూర్ ఫ్లాప్ కావడంతో…ఘోరమైన ఎదురు దెబ్బలు తిన్నాడు చిరు….అయితే అవన్నీ పక్కన పెడితే…చిరు ఇప్పుడు మరో రిస్క్ చేస్తున్నాడు. ఏకంగా….151 సినిమాగా ‘ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి’ కధ చేస్తున్నట్లు తెలుస్తుంది….ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తి అయిన ఈసినిమాకు సంబంధించి చిరంజీవి లుక్ ఎలా ఉండాలి అన్న చర్చలు ప్రస్తుతం మెగా కాంపౌండ్ లో జరుగుతున్నట్లు టాక్. అయితే …‘ఉయ్యాలవాడ నరసింహారెడ్డి’ కధ, మనిషి ఎలా ఉంటాడు…వస్త్ర ధారణం…ఎలా ఉంటుంది…ఫిసికల్ గా ఎలా ఉంటాడు అన్న దానిపై విశ్లేషించగా….కండలు తిరిగిన శరీరంతో ఆజానుబాహుడుగా ఉండడమే కాకుండా…దీనికితోడు ఆరడుగుల ఆజానుబాహుడు అను తెలుస్తుంది…ఇక వస్త్ర ధారణం విషయానికి వస్తే….తలపై పెద్ద తలపాగ బుర్ర మీసాలతో చాల కర్కశంగా ఉయ్యాలవాడ ఉండేవాడు అని సమాచారం.
మరి అలాంటి గెటప్ చిరంజీవికి నప్పుతుందా అన్న విషయమై ప్రస్తుతం మెగా కాంపౌండ్ లో చాల లోతైన చర్చలు జరుగుతున్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు దర్శకుడు సురేంద్ర రెడ్డి చిరంజీవి గెటప్ కు తలపాగా లేకుండా డిజైన్ చేస్తే బాగుటుంది అని సూచనలు ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. చాల్ మంది అయితే ఈ గెటప్ చిరు కి సెట్ కాదు అని విమర్శలు సైతం చేస్తున్నారు…అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి అంటే…ఇది ఉయ్యాలవాడ కధే కానీ,,,,పూర్తి కమర్షియల్ హంగులతో ఉయ్యాలవాడ్ కధని మూల కధగా చూపించే ప్రయత్నం అనే చెప్పాలి….మరి ఈ కధ ఎలా ఉంటుదో…. చిరు పాత్ర ఏంటో చూద్దాం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.