స్టార్ మా ఛానల్ కి బూస్ట్ ఇచ్చిన బిగ్ బాస్ షో ఇప్పుడు సీజన్ 2 నడుస్తోంది. ఎన్టీఆర్ హోస్ట్ గా చేసినప్పుడు వచ్చిన రేటింగ్ ని అధిగమించడానికి నాని ప్రయత్నిస్తున్నారు. అలాగే కంటెస్టెంట్స్ విషయంలోనూ నిర్వాహకులు మార్పులు చేస్తున్నారు. ఈసారి సామాన్యులకు అవకాశం ఇస్తామని డప్పు కొట్టిన షో నిర్వాహకులు అన్నట్టుగానే ముగ్గురికి హౌస్ లోకి వెళ్ళడానికి అవకాశం ఇచ్చారు. వారిని వరుసగా బయటికి పంపించడమే అంతటా విమర్శకులకు తావు ఇస్తోంది. తొలి వారంలో మోడల్ సంజనని బయటికి పంపించారు. నందినిని లోపలి పంపించడానికి నన్ను అనవసరంగా ఎలిమినేటి చేశారని సంజన విమర్శించింది.
సరే ఆ విషయాన్నీ పక్కన పెడితే ఈ వారం మరో కామన్ మ్యాన్ నూతన్ నాయుడు ని సాగనంపారు. దీనిపై విమర్శలు వస్తాయని ముందే గ్రహించిన నిర్వాహకులు నానితో బటర్ ఫ్లై కథ వినిపించారు. అతను ఎన్ని కథలు చెప్పిన సామాన్యులు బాగా హర్ట్ అయ్యారు. బిగ్ బాస్ కి అసలు కామన్ సెన్స్ లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఓటింగ్, ఎలిమినేషన్ ఏది పారదర్శకంగా, నిజాయితీగా జరగడం లేదని.. తమకు ఇష్టం లేనివారికి బయటికి పంపిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. వచ్చే వారంలో మిగిలి ఉన్న గణేష్ ని కూడా ఏదో కారణం చెప్పి బయటికి పంపిచేస్తారేమోనని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి విమర్శలు వెల్లువెత్తిన కారణంగా నిర్వాహకులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో చూడాలి.