మంచు మోహన్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నెగిటివ్ షేడ్స్ కలిగిన పాత్రలతో కెరీర్ ను ప్రారంభించిన ఈయన అటు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా చేసి మెప్పించారు. ఈ క్రమంలో ఆయన మాస్ ఆడియన్స్ కు బాగా దగ్గరయ్యారు. అలా వచ్చిన క్రేజ్ వల్ల ఈయనకు హీరోగా కూడా అవకాశాలు వచ్చాయి. అయితే ఆశించిన సక్సెస్ అందుకోవడానికి చాలా టైం పట్టింది. దాని కోసం ఈయన నిర్మాత కూడా మారాల్సి వచ్చింది.
‘శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్’ అనే సంస్థని ప్రారంభించి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు. ఓ దశలో చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ స్టార్ హీరోల సినిమాలకు ధీటుగా మోహన్ బాబు హీరోగా నటించిన సినిమాలు భారీ కలెక్షన్స్ సాధించిన సందర్భాలు ఉన్నాయి. ఇక సాయి పల్లవి గురించి కూడా అందరికీ తెలిసిందే. ఎటువంటి గ్లామర్ షో, ఇంటిమేట్ సన్నివేశాలు, లిప్ లాక్ సన్నివేశాల్లో నటించకుండానే ఈమె స్టార్ హీరోయిన్ స్టేటస్ ను దక్కించుకుంది.
అయితే మోహన్ బాబు, సాయి పల్లవి లకు కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటంటే.. మోహన్ బాబు పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆయనకు వాణిజ్య ప్రకటనల్లో నటించే అవకాశం వచ్చింది. కానీ ఆయన నటించలేదు. సాయి పల్లవి కూడా అంతే. భారీ పారితోషికం ఇస్తాను అని చెప్పినా.. ఎటువంటి యాడ్స్ లో ఈమె నటించలేదు. అలాగే ఇద్దరిలో ఉన్న మరో కామన్ పాయింట్.. డెడికేషన్. మోహన్ బాబు.. షూటింగ్ స్పాట్ కు చెప్పిన టైంకి వచ్చేస్తారు.
సాయి పల్లవి (Sai Pallavi) కూడా అంతే. ఇక మరో కామన్ పాయింట్ ఏంటంటే.. మోహన్ బాబు తన వారసులను సినిమాల్లో ఎంకరేజ్ చేయను అని ముందుగానే చెప్పారట. మీకిష్టమైతే సినిమాల్లోకి రండి కానీ.. మీ అనుభవం మీద మీరు ఎదగాలి కానీ నా నుండి ఎటువంటి సహాయం కొరవద్దు అని ముందే చెప్పారట. సరిగ్గా సాయి పల్లవి కూడా తన చెల్లెలు పూజకి అదే చెప్పింది.