Chiranjeevi, Rajinikanth: మెగాస్టార్, రజినీ మూవీలు రెండూ ఒకటేనా?

కోలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరైన రజినీకాంత్ నటిస్తున్న పెద్దన్న సినిమా వచ్చే నెల 4వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది. గతేడాది దీపావళికి రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఈ ఏడాది దీపావళికి రిలీజ్ కానుండటం గమనార్హం. ఈ సినిమాలో రజినీకాంత్ చెల్లి పాత్రలో కీర్తి సురేష్ నటించారు. అయితే ఈ సినిమాకు, చిరంజీవి హీరోగా నటిస్తున్న భోళా శంకర్ సినిమాకు కొన్ని పోలికలు ఉన్నాయి. పెద్దన్న సినిమాలో భోళాశంకర్ సినిమాలో చెల్లి పాత్రలో నటిస్తున్న హీరోయిన్ కీర్తి సురేష్ అనే సంగతి తెలిసిందే.

పెద్దన్న కోల్ కతా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కగా భోళా శంకర్ కూడా ఇదే బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోంది. పెద్దన్న ట్రైలర్ లో, భోళాశంకర్ టైటిల్ పోస్టర్ లో హౌరా బ్రిడ్జిని చూపించారనే సంగతి తెలిసిందే. భోళాశంకర్ మూవీ తమిళంలో బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన వేదాళం రీమేక్ కావడంతో మెగా అభిమానులకు కంగారు మరింత ఎక్కువైంది. ఈ రెండు సినిమాలలో చెల్లెలి పాత్రే ఎంతో కీలకం కావడం గమనార్హం.

అయితే కొంతమంది అభిమానులు మాత్రం పోలికలు ఉన్నా కథ విషయంలో కచ్చితంగా తేడాలు ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. పెద్దన్న సినిమా రిలీజైతే రెండు సినిమాల కథలలో పోలికలు ఉన్నాయో లేదో మరింత క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు. భోళా శంకర్ సినిమా లాంఛ్ వచ్చే నెల 11వ తేదీన జరగనుండగా నవంబర్ 15వ తేదీ నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందని తెలుస్తోంది.

నాట్యం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సంకల్ప బలమే ‘మురారి’ ని క్లాసిక్ చేసింది, 20 ఏళ్ళ ‘మురారి’ వెనుక అంత కథ నడిచిందా…!
ఫ్యాక్షన్ సినిమాకి సరికొత్త డెఫినిషన్ చెప్పిన కృష్ణవంశీ ‘అంతఃపురం’…!
టాలీవుడ్‌ టాప్‌ భామల రెమ్యూనరేషన్‌ ఎంతంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus