ఈ పోటీలో సితారకే ఎక్కువ మార్కులు..!

సూపర్ స్టార్ మహేష్ బాబు తనయుడు గౌతమ్ కృష్ణ కంటే అతని చెల్లెలు సితార క్రేజీ పనులతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. గత ఏడాది వేసవి సెలవుల్లో మట్టితో కుండలు చేయడం, కిచెన్ లోకి వెళ్లి చాకోలెట్ కేక్ సిద్ధం చేయడం.. వంటి వీడియోలు సోషల్ మీడియాలో విహారం చేశాయి. కొన్ని రోజుల క్రితం ఫామ్ హౌస్ కి వెళ్లి ఆవు వద్ద పాలు తాగుతున్న లేగదూడను చూస్తూ ఉండిపోయింది. ఆ క్షణంలో నమ్రత కూతురి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటో విశేషంగా ఆకట్టుకుంది. ఈసారి ఏకంగా హీరోయిన్ తోనే పోటీకి దిగింది.

తన జుట్టుని స్ట్రైట్ చేసుకొని కైరా అద్వానీతో కలిసి ఫోటో దిగింది. ఈ ఫోటోని నమ్రత షేర్ చేస్తూ “భరత్‌ అనే నేను’ సెట్‌‌లో లాంగెస్ట్‌ హెయిర్‌ అవార్డుకు పోటీ జరుగుతోంది. ఇద్దరు అందగత్తెలు పోటీపడుతున్నారు. ఎవరి జుట్టు పొడవుగా ఉంది” అని రాసి పోస్ట్ చేసింది. ఇందుకు మహేష్ అభిమానులు సితారకే ఎక్కువగా మార్కులు వేశారు. కొరటాల శివ దర్శకత్వంలో మహేష్ బాబు నటిస్తున్న భరత్ అను నేను సినిమా గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లో జరుగుతోంది. రేపటితో షూటింగ్ కంప్లీట్ కానుంది. నెక్స్ట్ షెడ్యూల్ ని లండన్ లో ప్లాన్ చేశారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 20 న రిలీజ్ కానుంది. శ్రీమంతుడు కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus